Tuck Jagadish and Love Story: ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) నిర్మాతలకు, ‘లవ్ స్టోరీ’ ( Love Story) నిర్మాతలకు మధ్య ఓ వివాదం చెలరేగింది. మొదట ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అంటూ ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ‘టక్ జగదీష్’ సినిమాని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశారు. అయితే, అమెజాన్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 10న రిలీజ్ విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసింది.
దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఈ రెండు చిత్రాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మేం ప్రకటించిన తర్వాత అదే రోజు మీరు ఎలా సినిమా రిలీజ్ ను ప్రకటిస్తారు ? అంటూ లవ్ స్టోరీ నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి.. పనిలో పనిగా హీరో నానిని కూడా అడ్డమైన తిట్లు తిట్టారు. ఎలాగూ తన సినిమా ఓటీటీ వేదిక పై రిలీజ్ అవుతుంది కాబట్టి.. పెద్దగా తనకు హిట్ ప్లాప్ లతో పని లేదు అనుకున్నాడు.
అందుకే, నాని కూడా లవ్ స్టోరీకి పోటీగా తన సినిమాని రిలీజ్ చేయాలనే ముందు అనుకున్నాడు. కానీ వస్తోన్న విమర్శలు దెబ్బకు మొత్తానికి నానికి తత్వం బోధపడింది. నాని థియేటర్ల వ్యవస్థను చంపేస్తున్నాడు అంటూ డిస్ట్రిబ్యూటర్స్ నాని పై ఫైర్ అయ్యారు. దీనికితోడు తెలంగాణ థియేటర్ల సంఘం కూడా నానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసి.. నీ భవిష్యత్తు సినిమాలకు కష్టాలు తప్పవు అంటూ నానికి ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
దాంతో నాని మొత్తానికి కాంప్రమైజ్ అయ్యాడు. నిర్మాత సునీల్ నారంగ్ కి ఫోన్ చేసి.. జరిగిన దానిలో తన తప్పు ఏమి లేదు అని, దయచేసి తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దు అంటూ వివరణ ఇచ్చాడు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వాళ్లతో కూడా మాట్లాడి.. ‘టక్ జగదీష్’, ‘లవ్ స్టోరీ సినిమాల విడుదల మధ్య ఉన్న వివాదాన్ని కూల్ చేసాడట.
తాజా అప్ డేట్ ప్రకారం ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ‘టక్ జగదీష్’ ఆ తర్వాత వారం ఓటీటీలో రిలీజ్ కానుంది.