Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీ టీఆర్ఎస్ పై విరుచుకుపడుతూనే ఉంటారు. అలాగే ముస్లింల తీరుపై ఎప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఉంటారు. దీంతో ఆయన భద్రతపై రకరకాల రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. దీంతో ఆయన కోసం భద్రత పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇటీవల సంజయ్ భద్రతకు ముప్పు ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ ఆదేశాలతో పోలీసులు భద్రత పెంచారు. తరువాత తగ్గించారు. దీనిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో సంజయ్ రాజకీయ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతుండటంతో ఆయనపై కొందరు కక్షపూరితంగా ఉన్నారనే వాదనలు వస్తున్నాయి. దీంతో ఇంటలిజెన్స్ అదికారులు సూచనలతో ఆయన భద్రత పెంచినా తరువాత తగ్గించారు. దీనిపై కూడా దుమారం రేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచిందా లేక కేంద్రమే నియమించిందా అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో ఒకరిపై మరొకరు బుదర జల్లుకుంటున్నారు.
Also Read: Pawan Kalyan: బీజేపీతోనే వైసీపీ.. టీడీపీతో వద్దు.. పవన్ ఏం చేయనున్నారు?
ఇప్పటికే ఆయన తన పదజాలంతో అందరిని భయపెడుతున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ అధికారుల సూచనల మేరకు రాష్ట్ర పోలీసులే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. కానీ మళ్లీ తగ్గించడంపైనే అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుకు అందరిలో సందేహాలు వస్తున్నాయ. ఎందుకు భద్రత పెంచారు? మళ్లీ ఎందుకు తగ్గించారు? అనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో ఎందుకు పొంతన లేని విధంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రముఖుల భద్రత ప్రభుత్వాల బాధ్యత. అందుకే వారి కోసం ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల సూచనలతో భద్రతను పెంచడం మామూలే. కానీ వెంటనే తగ్గించడం ఏమిటని అడుగుతున్నారు. దీంతో సంజయ్ కు భద్రత ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో అధికారుల్లోనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వానికి తెలియకుండానే సెక్యూరిటీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. దీంతోనే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వాలు భద్రత విషయంలో గోప్యత పాటించడం ఎందుకు? రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ఆలోచిస్తే సమస్యలు రావు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వాలు ఇలా ఉన్నపళంగా నిర్ణయాలు మార్చుకుంటే సంజయ్ భద్రత ప్రశ్నార్థకమే. ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం భద్రతను పెంచాల్సిందే కానీ తగ్గించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. మొత్తానికి ఆయన భద్రతపై అధికారుల మీనమేషాలతో సంజయ్ కి నష్టం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం సూచిస్తే రాష్ట్రం పాటించాల్సిందే. కానీ ఇలా మొండి వైఖరి అవలంభిస్తే తరువాత బాధ పడాల్సి వస్తోందని చెబుతున్నారు.
Also Read:Minister KTR: రాజుతో కయ్యం.. మంత్రులతో నెయ్యం.. కేటీఆర్ కొత్త స్ట్రాటజీ ఇదేనా