https://oktelugu.com/

Chandramukhi 2 First Look: చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ పై పేలుతున్న ట్రోల్స్… ఎక్కడ తేడా కొట్టింది!

చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం హీరో లారెన్స్ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ స్టైల్ ను అనుకరించినట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 31, 2023 / 02:57 PM IST

    Chandramukhi 2 First Look

    Follow us on

    Chandramukhi 2 First Look: చంద్రముఖి సినిమా తెలుగు, తమిళ భాషల్లో హారర్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా. రజినీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనమని చెప్పాలి. 2005 లో విడుదలైన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. 18 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ చేస్తే మంచి TRP రేటింగ్స్ వస్తున్నాయి.

    2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్‌ చేశాడు. దీనికి సీక్వెల్‌ చేయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్‌ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్‌ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక తాజాగా “చంద్రముఖి 2” సినిమాను తెరకెక్కిస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

    చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం హీరో లారెన్స్ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ స్టైల్ ను అనుకరించినట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తుంది. చంద్రముఖి లో రజినీకాంత్ నటన కావచ్చు, అతని స్టైల్ కావచ్చు ఇప్పటికి ఒక యూనిక్. అలాంటిది లారెన్స్ దాన్ని కాపీ కొట్టినట్లు ఫస్ట్ లుక్ ఉండటంతో విమర్శలు వస్తున్నాయి. అయితే ఒక్క లుక్ ను చూసే ఒక అంచనాకు రావడం భావ్యం కాదు. సినిమా ట్రైలర్ విడుదల అయితే కానీ ఒక అంచనాకు రాలేము.

    బాలీవుడ్ ఫైర్ బాండ్ కంగనా రనౌత్ రాజనర్తకిగా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ ఖర్చుతో నిర్మిస్తుంది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చంద్రముఖి సినిమాలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాను నిలబెట్టాయనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని కీరవాణిని ఈ సినిమా కి తీసుకున్నట్లు తెలుస్తుంది.