Trivikram Speech: సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులో నిర్వహించారు… ఇక ఈ సినిమా ఫంక్షన్ లో త్రివిక్రమ్ చాలా తక్కువ మాటలు మాత్రమే మాట్లాడి స్పీచ్ ని చాలా తొందరగా ముగించారు. నిజానికి త్రివిక్రమ్ మాట్లాడే మాటలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలు ఆ ఈవెంట్ మొత్తానికే చాలా హైలెట్ గా నిలుస్తాయి. అలాంటి త్రివిక్రమ్ ఈ ఈవెంట్ లో మాత్రం మాటల తూటాలను పేల్చడం లో కొంచెం వెనుకబడ్డారనే చెప్పాలి.
ఆయన ఇచ్చిన స్పీచ్ లో అంతా పసలేదని చాలా మంది త్రివిక్రమ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంతకుముందు ఆయన ఏదైనా స్పీచ్ ఇచ్చిన, ఎవరి గురింఛైన మాట్లాడిన ఆ వీడియో ని ప్రతి ఒక్కరూ రిపీటెడ్ గా చూస్తూ ఆ మాటలు వింటూ ఇన్ స్పైర్ అయ్యేవారు. మరి గుంటూరు కారం ఈవెంట్ లో మాత్రం చాలా సింపుల్ గా త్రివిక్రమ్ తన స్పీచ్ ని ముగించడం వెనుక కారణం ఏంటి అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇప్పుడనే కాదు గత రెండు మూడు ఫంక్షన్ల లో కూడా ఎక్కువ గా మాట్లాడలేదు ఆయన ఎందుకు అలా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక దీన్ని బట్టి చూస్తే కొంత మంది త్రివిక్రమ్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. బాగా ఓవర్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తుండడం, అలాగే స్టేజ్ మీదికి రాగానే అన్ని తనకే తెలుసు అన్నట్టుగా త్రివిక్రమ్ వ్యవహరిస్తూ ఉంటాడు ప్రేక్షకులను మాయ చేస్తూ మాట్లాడుతుంటాడు అనే కామెంట్లు ఆయనకి ఎక్కువగా వినిపించడం తో తను ఎక్కువగా మాట్లాడకూడదు అని అనుకొని స్టేజ్ మీదికి వచ్చి పరిమిత మాటలు మాత్రమే మాట్లాడి తన స్పీచ్ ని ముగిస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఆయనంత సింపుల్ గా మాట్లాడితే ఆయన అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ స్టేజి మీదకి వచ్చాడు అంటే అక్కడున్నా అభిమానులు ఆయన మాటలకు ఫిదా అయిపోవాలి. టీవీల్లో గాని, మొబైల్స్ లో గాని ఆ ఈవెంట్ ని చూస్తున్న వారు రిపీటెడ్ గా ఆయన మాటలను ఆ వీడియోని చూస్తూ ఉండాలి కానీ ఒక్కసారి చూసి వదిలేసేలా ఆయన స్పీచ్ ఉండకూడదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…