Aadarsa Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై ఆడియన్స్ లో చాలా ఆసక్తి ఉండేది. 300 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాని అందుకున్న తర్వాత ఏ హీరో అభిమాని అయినా, మళ్లీ ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చే సినిమానే ఎంచుకోవాలని కోరుకుంటారు. అలా వెంకటేష్ అభిమానులు కూడా కోరుకున్నారు. అందుకే ఆయన ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుందని మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక నేడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వడం తో మేకర్స్ ఆ విషయాన్నీ తెలుపుతూ టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.
ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెంబర్ 47′(Aadarsa Kutumbam) అనే టైటిల్ ని ఖరారు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఈమధ్య కాలం లో ఇలాంటి వెరైటీ టైటిల్స్ ఎక్కువ అయ్యాయి., ‘జులాయి’ చిత్రం వరకు ఆయన సినిమా టైటిల్స్ మామూలుగానే ఉండేవి. ఆ తర్వాతే ‘అ..ఆ’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అజ్ఞాతవాసి’, ‘అలా వైకుంఠపురంలో’, ‘అరవింద సామెత వీర రాఘవ’ ఇలాంటి వెరైటీ టైటిల్స్ పుట్టుకొచ్చాయి. కానీ వాటికి జనాలు అలవాటు పడ్డారు. కానీ వెంకటేష్ తో చేస్తున్న చిత్రానికి మరీ నాసిరకపు టైటిల్ ని పెట్టారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు టైటిల్స్ వెరైటీ గా ఉన్నప్పటికీ, అవి ట్రెండీ గా, అర్థం అయ్యి అవ్వనట్టు ఉండేవి. కానీ ఈసారి ఆ మార్క్ మిస్ అయ్యిందని అందరి అభిప్రాయం.
ఇకపోతే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ చేస్తున్న మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. గతం లో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం లోని డైలాగ్స్ ఆడియన్స్ చెవుల్లో అమృతం పోసినట్టు గా ఉంటాయి, ఇక సన్నివేశాలు ఎంతో ఆహ్లాదకరంగా, కుటుంబం తో కూర్చొని కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలా ఉంటే వెంకటేష్ ఖాతాలో మరో 300 కోట్ల సినిమా వచ్చినట్టే. ఒకవేళ ఆ రేంజ్ లో లేకపోయినా, కనీస స్థాయిలో అయినా ఉంటే మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వస్తాయి. త్రివిక్రమ్ సినిమాని చూసి కడుపుబ్బా నవ్వుకోవడం, అదే విధంగా సెంటిమెంట్ సన్నివేశాలను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి ఆడియన్స్ చూసి చాలా కాలమే అయ్యింది. ఈ సినిమాతో ఆ లోటు ని పూడుస్తాడో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.
The title. The vibe.
The excitement. ALL LOADED!Presenting the Title & First Look of
“ : – ” #AK47 | #AadarshaKutumbam | #Venky77 | #VenkateshXTrivikramShoot kicks off today… arriving BIG this Summer… pic.twitter.com/ZmWnumxnoP
— Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2025