Trivikram tortured Prakash Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మూస ధోరణి కథలతో సినిమాలు వచ్చేవి. వాటికి చెక్ పెడుతూ తన పెన్నుతో కొత్త కథలను అందించిన రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ మొదట్లోనే ఆయన భారీ సక్సెస్ లను సాధించాడు. ఇక దర్శకుడిగా మారి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో గొప్ప విజయాలను సాధించాడు. అలాంటి త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ గా ఉన్నప్పుడు తనకి ఇంకా పెళ్లి కూడా కాని రోజుల్లో సునీల్ తో కలిసి అర్ధరాత్రిలో ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటి డోర్ కొట్టేవాడట. ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ గాని మందు బాటిల్స్ గాని తీసుకెళ్లే వాడినట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓపెన్ గా ఒక ఈవెంట్లో చెప్పాడు. అప్పట్లో ప్రకాష్ రాజ్ ను నేను చాలా వరకు ఇబ్బంది పెట్టానని ప్రకాష్ రాజ్ నన్ను ఏమీ అనలేని పరిస్థితిలో ఉండేవాడని వీళ్ళు ఇలా తయారయ్యారెంట్రా అని ప్రకాష్ అనుకునేవాడు.
కానీ ఏదో ఒక టైంలో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అని నమ్మకం కూడా ప్రకాష్ రాజ్ కి ఉండేదని త్రివిక్రక్ శ్రీనివాస్ చెప్పాడు. కెరియర్ స్టార్టింగ్ లో తన స్ట్రగ్లింగ్స్ ఎలా ఉండేవో చెప్పాడు. మొత్తానికైతే ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో తను కూడా ఒకడిగా నిలవడం అనేది అతని అభిమానులకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది.
మహేష్ బాబు తో చేసిన సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ పెట్టి ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చే సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్స్ ను ఆయన పర్ఫెక్ట్ రాస్తుంటాడు. అందువల్లే అతని సినిమాల్లో హీరోలు కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతూ ఉంటారు. అలాగే వాళ్ళ క్యారెక్టర్ కి పెట్టే పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాల్లోని హీరోల పేర్లను సైతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు.
