Trivikram Remuneration: సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకప్పుడు సినిమాకు డైరెక్టరే బాస్. ఆయన చెబితే నిర్మాత కూడా వినేవారు. కానీ రాను రాను పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడున్న కాలంలో కొంత మందిని మినహాయించి సినిమాలు తీసే డైరెక్టర్లను ఎవరూ పట్టించుకోవడంలేదు. పైకి వారి పేరు కనిపిస్తున్నా.. లోలోపల జరిగేది మొత్తం వేరే. ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉన్న పవన్ తో సినిమాలు తీయాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అందరికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పవన్ సైతం కొత్తవారితో సినిమాలు చేసేందుకు ముందకు వస్తారు. కానీ డైరెక్టర్లు ఎవరు వచ్చినా.. పవన్ సినిమాకు మాత్రం ఆయనే బాస్ అన్నట్లుగా ఉంటున్నారు. పవన్ తో ఎన్నో సినిమాలు తీసిన ఆయన స్క్రిప్ట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే మాత్రం ఆయన తప్ప ఇంకెవరు ఉండరు. ఇంతకీ ఆయన ఎవరనేదేగా?
మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ లేకుండా ఫ్యూచర్లో పవన్ సినిమా రాదేమో అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే పవన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత దాదాపు వకీల్ సాబ్ మినహా మిగతా సినిమాలన్నింటికీ త్రివిక్రమ్ దే పైచేయి అన్నట్లుగా ఉంటోంది. ఇప్పుడు రిలీజ్ కాబోయే ‘బ్రో’ సినిమాకూ త్రివిక్రమే మెయిన్ అని అంటున్నారు. ఇంతకుముందు వచ్చిన ‘భీమ్లా నాయక్’ మూవీకి తమిళ డైరెక్టర్ సాగర్. కానీ ఆయన పేరు కనిపించింది గానీ..ఈయనే సాగర్ అని గుర్తించలేదు. దీంతో భీమ్లా నాయక్ పేరు చెప్పినప్పుడల్లా పవన్ తో పాటు త్రివిక్రమ్ పేరు మాత్రమే వినిపిస్తుంది.
లేటేస్టుగా పవన్ సినిమా ‘బ్రో’ జూలై 28న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి వాస్తవానికి డైరెక్టర్ సముద్రఖని. తమిళంలో ‘వినోదయ సీతం’ అనే సినిమా తీయడంతో అక్కడ హిట్ కావడంతో ఆయనే నేరుగా తెలుగులో పవన్ తో సినిమా తీశాడు. సముద్రఖనికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు ఉంది. నటుడిగా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. కానీ తెలుగులో స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే మొత్త త్రివిక్రమ్ దేనని విపిస్తోంది. పైకి సముద్రఖని పేరున్నా నడిపించేంది ఆయనే అని అంటున్నారు.
మరో విషయమేంటంటే..బ్రో సినిమాకు త్రివిక్రమ్ రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కొంతమంది హీరోలకంటే ఈ రెమ్యూనరేషన్ ఎక్కువ. అయితే బ్రో సినిమాకు మెయిన్ డైరెక్టర్ కాకున్నా త్రివిక్రమ్ కు అంత రెమ్యూనరేషన్ ఎందుకని కొందరు రచ్చ చేస్తున్నారు. కానీ పవన్ సినిమాకు డైరెక్టర్ ఎవరైనా వెన్నంటి చూసుకునేది ఆయనేనని అందుకే అంత ప్రిఫరెన్స్ అని చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా భవిష్యత్ లో ఇంకా ఎన్నిపవన్ సినిమాలకు త్రివిక్రమ్ అండ ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.