Venkatesh – Ravi Teja: టాలీవుడ్ లో కోయండి అయినా , సెంటిమెంట్ అయినా, మాస్ అయినా ఇలా ఏ యాంగిల్ ని అయినా అద్భుతంగా వెండితెర మీద పండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీ లో ది బెస్ట్ అని అనిపించుకోవడం చాలా కష్టం. కానీ విక్టరీ వెంకటేష్ అలా అనిపించుకున్నాడు. నిన్నటి తరం హీరోలలో దాదాపుగా అన్నీ జానర్స్ ని టచ్ చేసిన హీరో ఈయన మాత్రమే.
అన్నీ జానర్స్ లో మళ్ళీ సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈయన సినిమా వస్తుంది అంటే చాలు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టేస్తారు. నేటి తరం స్టార్ హీరోలతో సమానంగా కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇక నేటి తరం లో విక్టరీ వెంకటేష్ రేంజ్ నటుడు ఎవరు అంటే మాస్ మహారాజ రవితేజ పేరు చెప్పొచ్చు. ఈయన కూడా ఏ ఎమోషన్ ని అయినా అద్భుతంగా పండించగలడు.
అందుకే ఆయన సినిమాలను అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇలాంటి ఆల్ రౌండర్స్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ఎంటర్టైన్మెంట్ కి కొదవే ఉండదు. వెంకటేష్ దాదాపుగా ప్రతీ హీరో తో మల్టీస్టార్ర్ర్ చేసాడు కానీ, రవితేజ తో మాత్రం ఇప్పటి వరకు చెయ్యలేదు. భవిష్యత్తులో వీళ్లిద్దరు చేస్తారేమో తెలియదు కానీ, గతం లో మాత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ ఇద్దరు మిస్ అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే తమిళం లో మాధవన్ , విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘విక్రమ్ వేద’ అనే చిత్రం విడుదలై కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
ఈ సినిమాని తెలుగు లో ముందుగా రవితేజ , వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిద్దాం అని అనుకున్నారట. కానీ ఇద్దరూ ఎవరు ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాని రీమేక్ చేస్తే వీళ్ళిద్దరితోనే చేస్తారట, చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈ డ్రీం కాంబినేషన్ లో ఈ రీమేక్ వస్తుందో లేదో అనేది.