Trivikram On Pooja Hegde: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి కోట్లాది మాండీ అభిమానులను సొంతం చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు, నూటికో కోటికో ఒక్కరికి వస్తుంది ఆ అదృష్టం. అలాంటి అదృష్టం పూజ హెగ్డే కి కూడా వచ్చింది. ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తొలిసినిమాతోనే మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మొదటి సినిమా ‘ముకుంద’ చిత్రం లో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
అయినా కానీ ఆమెకి అవకాశాలు రావడం ఆగలేదు. ఏకంగా తన అభిమాన హీరో హృతిక్ రోషన్ తో బాలీవుడ్ లో ‘మోహెన్ జోడారో’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
సౌత్ లో ఉన్న స్టార్ హీరోస్ అందరితో సినిమాలు చేసి అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈమె ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో గత కొన్నేళ్ల నుండి ప్రేమాయణం నడుపుతుంది అనే టాక్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ ఉంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కాదు, ఈమెని త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుండి తప్పిస్తున్నట్టుగా వచ్చిన వార్తలు సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది. ఇది కేవలం మహేష్ తీసుకున్న నిర్ణయం వల్లే అని ఇండస్ట్రీ లో టాక్.
దీనితో పూజ హెగ్డే బాగా హర్ట్ అయ్యిందని, ఆమెని బుజ్జగించే ప్రయత్నం లో భాగం గా త్రివిక్రమ్ భార్య నిర్మాణ సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణం లో సాయి ధరమ్ తేజ్ – సంపత్ నంది కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ రోల్ ని త్రివిక్రమ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమా కూడా లేకపోవడం తో ఇందులో నటించేందుకు ఒప్పుకుందట. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమా తో పూజ హెగ్డే బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.