Rajamouli and Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితల స్థాయిని పెంచిన రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ మొదట్లో రైటర్ గా గొప్ప విజయాలను అందుకున్న ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నింటిని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు… దీనివల్ల ఆయన సంపాదన సంవత్సరానికి 100 కోట్లకు పైనే ఉంటుంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి కంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ సంపాదిస్తున్నారంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి ఒక సినిమాకి 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఆ సినిమా మీద ఆయన దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తాడు… ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే నిర్మాణంలో భాగమవ్వడం,
అలాగే సినిమా ఫైనల్ కాపీని జడ్జ్ చేసినందుకు అతనికి సపరేట్ అమౌంట్ ని ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం కథలను వింటూ ఆ కథల మీద వర్క్ చేసినందుకు అటువైపు నుంచి కూడా అతనికి డబ్బులు వస్తున్నాయి. తద్వారా ఆయన సంవత్సరానికి 150 కోట్ల వరకైతే సంపాదిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఒక రకంగా పాన్ ఇండియా డైరెక్టర్లతో పోలిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు.
వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినప్పటికి ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకొని ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులకు పెద్దగా నచ్చే అవకాశం లేకుండా పోయింది. కానీ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చేసి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది…