Trivikram: ‘గుంటూరు కారం ‘ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ప్రస్తుతం విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇది కాసేపు పక్కన పెడితే , త్రివిక్రమ్ వద్ద ఉన్నటువంటి ‘గాడ్ ఆఫ్ వార్'(#GodOfWar) అనే స్క్రిప్ట్ పై ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న డిమాండ్ సాధారణమైనది కాదు. కార్తికేయ స్వామి జీవిత చరిత్ర గురించి మనకు కొంతమాత్రమే తెలుసు. ఆయన గురించి ఎవరికీ తెలియని చరిత్ర ని ఇప్పటి వరకు వెండితెర పై ఏ డైరెక్టర్ కూడా ఆవిష్కరించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పురాణాల్లో గొప్ప జ్ఞానం ఉన్నవాడు కాబట్టి, ఈ స్క్రిప్ట్ ని ఆయనే రాసుకున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని #RRR తర్వాత ఎన్టీఆర్(Junior NTR) తో చేద్దామని అనుకున్నాడు.
కానీ బడ్జెట్ వర్కౌట్ అవ్వదు, ఇప్పట్లో ఇది వద్దులే అని పక్కన పెట్టేశారు. ఇక ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుష్ప సిరీస్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి, రెండు వేల కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడం తో, ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ చేస్తేనే బడ్జెట్ కూడా వర్కౌట్ అవుతుందని, ఆయనకు వెళ్లి త్రివిక్రమ్ కథ చెప్పగా, అల్లు అర్జున్ కి తెగ నచ్చేసింది. ‘పుష్ప 2’ తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అట్లీ తో సినిమాని మొదలు పెట్టాడు అల్లు అర్జున్. దీంతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్టీఆర్ కూడా మైండ్ లో ఈ సినిమా చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యి, మురుగన్ బుక్ ని చదవడం కూడా మొదలు పెట్టేసాడు.
అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ టీం నుండి త్రివిక్రమ్ కి మరోసారి కబురు అందింది. జూన్ నెలలో అట్లీ సినిమా పూర్తి అవుతుందని, అప్పటి నుండి మనం అనుకుంటున్నా ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రాన్ని మొదలు పెడుదాం అని అన్నాడట. ఎన్టీఆర్ కి ఈ సినిమా ఫిక్స్ అయిపోయింది అని చెప్పినా అల్లు అర్జున్ వినడం లేదట. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి, ఇద్దరికీ చెరో సినిమా చేసి పెడతానని , ఈ గాడ్ ఆఫ్ వార్ మాత్రం ప్రస్తుతానికి ఆపేద్దామని అన్నాడట. ఇద్దరు కూడా తనకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఈ ఒక్క స్క్రిప్ట్ కారణంగా ఇద్దరితో విభేదాలు వచ్చేలా ఉండనే భయం తోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.