Trivikram And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా గొప్ప క్రేజ్ అయితే ఉంది. ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలామంది చాలా రకాల కామెంట్లు చేసినప్పటికి ఆయన తన పంథా లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అటు పొలిటిషన్ గా గొప్ప పేరును సంపాదించుకుంటూనే ఇటు తన అభిమానుల కోరిక సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇలాంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏంటి అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇది రీమేక్ సినిమానా లేదంటే స్ట్రైయిట్ సినిమానా అనేది తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ కథను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి సురేందర్ రెడ్డి హీరోని చాలా స్టైలిష్ గా చూపిస్తాడు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను సైతం చాలా స్టైలిష్ గా చూపించాలనే ప్రయత్నం చేయబోతున్నాడట. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను రెట్టింపు చేసే విధంగా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
వీళ్ల కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ తొందర్లోనే ఒక అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది… ఏజెంట్ సినిమాతో బొక్క బోర్లా పడ్డ సురేందర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే మాత్రం తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయనకి మార్కెట్ మరింత కోల్పోయే అవకాశమైతే ఉంది…