Trivikram and Allu Arjun: జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో ఒకపక్క త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), ఇంకోపక్క అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నాటకాలు ఆడుతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో కుమార స్వామి జీవితానికి సంబంధించిన స్టోరీ తో ఒక భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ రావాల్సి ఉంది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ ఈ చిత్రమే చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ చివరికి అట్లీ తో సినిమాని మొదలు పెట్టాడు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కోపం వచ్చి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు. అంతే కాకుండా నిర్మాత నాగ వంశీ తో అల్లు అర్జున్ తో చేయాల్సిన కుమారి స్వామి మైథలాజికల్ మూవీ ని ఎన్టీఆర్ తో చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఒకటి చేయించాడు. ఎన్టీఆర్ కూడా ఈ క్యారెక్టర్ లో నటించడానికి ఆసక్తి చూపించాడు.
అయితే నేడు అల్లు అర్జున్ స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలిసి, మనం చేయాలనుకున్న కుమార స్వామి చిత్రాన్ని చేస్తున్నాను, వచ్చే ఏడాది మధ్యలో నుండి ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ ఇస్తాను సిద్ధం అవ్వండి అని చెప్పాడట. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం తారా స్థాయికి వెళ్ళింది. అల్లు అర్జున్ వద్దంటే ఆ స్టోరీ మాకు రావడం ఏంటి?, మళ్లీ అల్లు అర్జున్ కావాలంటే ఆ స్టోరీ ని వెనక్కి తీసుకోవడం ఏంటి?, అంటే ఎన్టీఆర్ మీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు?, ఆయన మీద మీకు మినిమం గౌరవం లేదా?, ఇలా చేస్తే ఆయన మనసు నొచ్చుకుంటుంది అనే స్పృహ కూడా లేదా? అసలేమీ మనుషులు మీరు అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా కథ నచ్చి, ఎన్టీఆర్ కుమార స్వామి జీవిత చరిత్ర మొత్తాన్ని అధ్యయనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మనం చాలానే చూసాము.
అలా మెంటల్ గా చెయ్యాలని ఫిక్స్ అయిన సినిమాను ఇలా లాగేస్తారా?, ఇండస్ట్రీ లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటూ సోషల్ మీడియా లో అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరుపై మండిపడుతున్నారు. గతం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ‘అరవింద సామెత వీర రాఘవ’ అనే చిత్రం చేసాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక అల్లు అర్జున్ తో అయితే ఇప్పటి వరకు ఆయన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో చిత్రాలు చేసాడు. మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, కానీ అలా వైకుంఠపురం లో చిత్రం మాత్రం ఆల్ టైం నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.