Vijay : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇళయ దళపతిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ప్రతి సినిమా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ఇక ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బైనప్పటికీ ఇక్కడ అంత మంచి ఆదరణ అయితే దక్కించుకోలేకపోతున్నాడనే చెప్పాలి. ఒక తుపాకీ(Tupaki) సినిమాను మినహాయిస్తే ఆయన చేసిన ఏ సినిమా కూడా తెలుగులో అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన త్రిష (Trisha) తో కలిసి గిల్లి (Gilli) అనే సినిమా చేశాడు. ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు(Okkadu) సినిమాకి రీమేక్ గా వచ్చిందే ఈ గిల్లి సినిమా… ఇక అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయమైతే ఏర్పడింది. దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చిన లియో (Leo) సినిమాలో కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు గా నటించడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా త్రిష విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్ షూటింగ్ సమయంలో తన షాట్ అయిపోయిన తర్వాత ఒక గోడ పక్కన కూర్చొని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు… ఆయనలో నాకు నచ్చనిదే అది…
ఆయన అందరితో మాట్లాడుతూ చాలా ఫన్నీగా ఉంటే బాగుంటుందని నేను అతనికి చాలా సందర్భాల్లో వివరించాను. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే అంటూ త్రిష చెప్పారు. ఇక అలాగే మరొక కోఆర్టిస్ట్ ఆయన శింబు మాత్రం షూటింగ్ సమయంలో తనను ఎప్పుడు టీజ్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు.
మరి ఏది ఏమైనా కూడా త్రిష దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన హవాని కొనసాగిస్తుందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈమె ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్రతి పాత్రలో వైవిధ్యమైన నటనను కనబరిచి యావత్ తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది…
నిజానికి త్రిషకి తెలుగులో మంచి ఆదరణ అయితే దక్కింది. ఒకానొక సమయంలో ఆమె టాప్ హీరోయిన్ ని రేంజ్ ని కూడా టచ్ చేసింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించడమే కాకుండా ప్రతి హీరోతో తనకు ప్రత్యేకమైన అనుబంధమైతే ఉందని తను చాలా సందర్భాల్లో వివరించింది…