Trisha Krishnan : నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీ గా గడుపుతున్న హీరోయిన్స్ లో ఒకరు త్రిష కృష్ణన్(Trisha Krishnan). తెలుగు, తమిళ భాషల్లో ఈమె రెండున్నర దశాబ్దాల నుండి అగ్ర కథానాయికగా కొనసాగుంతోంది. సౌత్ లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించి, ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇంత వయస్సు వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదరని గ్లామర్ ని మైంటైన్ చేస్తూ ఆమె ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలుస్తుంది. వయస్సు పెరిగే కొద్ది అందం పెరిగిపోతుంది అంటూ ఆమె పై అభిమానులు చేసే కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. అయితే సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ట్రోల్స్ పై త్రిష చాలా గట్టిగానే నేడు స్పందించింది. ఆమెలోని కోపాన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు.
Also Read : త్రిష 2 దశాబ్దాలకు పైన కెరియర్ ను కొనసాగించడానికి మహేష్ బాబు, దళపతి విజయ్ కారణమా..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే, రీసెంట్ గానే ఆమె తల అజిత్ హీరో గా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ సినిమాలో త్రిష క్యారక్టర్ పెద్దగా బాగాలేదని, చాలా యావరేజ్ గా ఉందని కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగకుండా పలువురు నెటిజెన్స్ అత్యంత ద్వేషపూరితమైన కామెంట్స్ పెట్టడం త్రిష కి తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో మాట్లాడుతూ ‘కొంతమంది ఒళ్ళంతా విషం నింపుకొని ఎదుటివారిపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీ అమ్మానాన్నలు మిమ్మల్ని ఎలా పెంచారు. మీ చుట్టూ అసలు మనుషులు ఎలా బ్రతుకుతున్నారు?, అసలు మీరు ఇలాంటి నీచమైన ఆలోచనలతో ప్రతీ రోజు రాత్రి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారు?, పిరికిపందల్లారా..ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
సెలబ్రిటీలే కదా, ఏమైనా మాట్లాడొచ్చు, మనం ఏమి మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరులే అని కొంతమంది ఆకతాయిలు అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. ఈమధ్య కాలం లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. యాక్షన్ కూడా తీసుకుంటున్నాయి. మరి త్రిష విషయం లో కూడా ప్రభుత్వాలు స్పందిస్తాయా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. మొదటి రోజు తమిళనాడు లో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : ప్రేమ గురించి త్రిష ఆసక్తికరమైన వ్యాఖ్యలు..నిశ్చితార్థం చేసుకుందా?