Trisha Comments On Mahesh Babu: మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి ఈ సినిమా విషయంలో అత్యంత కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ ని కూడా ప్రేక్షకులకు గాని, మహేష్ బాబు అభిమానులకు గాని తెలియజేయడం లేదు. కారణం ఏంటి అంటే ఈ సినిమాని 1000 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ మేకింగ్ వీడియో ని కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ చేసి వీలైనంత ఎక్కువ డబ్బులకు ఆ రైట్స్ ను అమ్మేసి డబ్బులను సంపాదించాలని చూస్తున్నాడు. ఇక ఈ మూవీ విషయం పక్కన పెడితే ఒకప్పుడు మహేష్ బాబు తో కలిసి నటించిన ఒక నటి మహేష్ బాబు తన ఫేవరెట్ యాక్టర్ అని చెబుతూ ఉండడం విశేషం… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా వచ్చిన అతడు (Athadu) సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించిన త్రిష చాలా తక్కువ సమయం లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలందరితో నటించిన ఏకైక నటిగా తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా దక్కింది…ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా థియేటర్లో పెద్దగా ప్రేక్షకులు ఆకట్టుకోనప్పటికి టీవీల్లో మాత్రం ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుందనే చెప్పాలి.
Also Read: బొమ్మరిల్లు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో…ఇప్పటికి బాధపడుతున్నాడా..?
ఈ సినిమా ఇప్పటికి టీవీల్లో టెలికాస్ట్ అయిన ప్రతిసారి టాప్ టి ఆర్ పి రేటింగ్ అయితే దక్కుతుంది. అంటే అతడు సినిమాకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సైనికుడు (Sainikudu) సినిమా డిజాస్టర్ అయింది.
అయితే త్రిష రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు తన ఫేవరెట్ యాక్టర్ అని చెబుతూనే చిన్నప్పుడు తను చదువుకునే సమయంలో మహేష్ బాబు చెన్నైలో చదువుతున్నప్పుడు మేమంతా ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుకునే వాళ్ళం అప్పుడు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను మహేష్ బాబు ని కలిశాను.
మేము యాక్టర్స్ అవుతామని అప్పుడు అనుకోలేదు. ఇక ఇప్పుడు మహేష్ బాబు నాకు క్లాస్ మేట్ అవ్వడమే కాకుండా నాకు ఫేవరెట్ హీరోగా మారడం అనేది ఒక యాదృచ్ఛికమనే చెప్పాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…