Triptii Dimri Remuneration : సోషల్ మీడియా నిత్యం ట్రెండింగ్ లో ఉండే రెండు మూడు సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం ఉంటుంది. ప్రభాస్(Rebel Star Prabhas), సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ పై కేవలం ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలను ఏర్పాటు చేసింది. అయితే రీసెంట్ గా ఈ చిత్రం కాంట్రవర్సిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ముందుగా దీపికా పదుకొనే(Deepika Padukone) ని ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నాడు సందీప్ వంగ. కానీ ఆమె సందీప్ పెట్టిన కండీషన్స్ కి ఒప్పుకోలేదు. దీంతో ఆ చిత్రం నుండి వాకౌట్ అయ్యింది. ఇది సాధారణంగా ప్రతీ పెద్ద సినిమాకు జరిగేదే. అయితే దీపికా రిజెక్ట్ చేసిన తర్వాత ఆమె తన పీఆర్ టీం తో చేయించిన కొన్ని స్తంట్స్ సందీప్ వంగ కి నచ్చలేదు.
Also Read: ఖలేజా మూవీ అప్పుడు ప్లాప్ అయి, రీ రిలీజ్ లో హిట్ అవ్వడానికి కారణం ఇదే…
దీంతో ఆయన పేరు ని ప్రస్తావించకుండా ట్విట్టర్ ద్వారా దీపికా పదుకొనే ని ఉతికిపారేసాడు. ఒక ఫిలిం డైరెక్టర్ గా నేను నీకు ఒక కథ చెప్పినప్పుడు మన మధ్య ఆ కథ బయటకు లీక్ అవ్వకూడదు అనే ఒప్పందం ఒకటి ఉంటుంది, కానీ నిన్ను కాదని నీకంటే చిన్న హీరోయిన్ ని ఈ సినిమాకు ఎంచుకున్నందుకు మీ పీఆర్ టీం తో కథ మొత్తాన్ని లీక్ చేయించావ్,ఇలాంటివి నువ్వు ఎన్ని చేసినా నేను భయపడను, ఏమి చేస్తావో చేసుకో అంటూ సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇంతకీ సందీప్ వంగ ఎంచుకున్న ఆ చిన్న హీరోయిన్ మరెవరో కాదు, ఆయన గత చిత్రం ‘యానిమల్’ లో సెకండ్ హీరోయిన్ రోల్ చేసిన త్రిప్తి దిమిరి(Tripti Dimri). ఈమె ఈ చిత్రం లో కనిపించింది కాసేపే అయినప్పటికీ నేషనల్ వైడ్ గా కుర్రాళ్ళ మనసుల్ని కొల్లగొట్టేసింది.
ఈమెని మా హీరో సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది అంటూ ఇప్పటి వరకు మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఎన్నో కామెంట్స్ చేశారు. చివరికి ఆమె ‘స్పిరిట్’ లాంటి క్రేజ్ చిత్రంతోనే మన టాలీవుడ్ కి గ్రాండ్ గా లాంచ్ కాబోతుండడం విశేషం. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోబోతుందని టాక్. ‘యానిమల్’ చిత్రానికి ఆమె కేవలం 40 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకుంది. ఇప్పుడే అదే డైరెక్టర్ తదుపరి చిత్రంతో ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందంటే ఈ గ్యాప్ లో ఆమె రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ‘స్పిరిట్’ చిత్రం ఆమె బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే సినిమా. ఈ చిత్రం హిట్ అయితే ఇక త్రిప్తి దిమిరి రేంజ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది.