Triple Role Heros In Tollywood: వెండితెర పై తమ అభిమాన కథానాయకుడు ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానులు ఉత్సాహంతో ఈలలు కేకలు వేస్తారు. మరి ఆయా హీరోలు త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగు సినీ చరిత్రలో ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.
సీనియర్ ఎన్టీఆర్:
తెలుగు సినీ లోకంలో త్రిపాత్రాభినయానికి పర్యాయపదం ఎన్టీఆర్. టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్ త్రిబుల్ రోల్ చేసిన ఏకైక కథానాయకుడు కూడా ఎన్టీఆరే. 1975 లో రిలీజైన దాన వీర సూర కర్ణ సినిమాలో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రల్లో ఆయన మెప్పించారు. ఈ చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి కొలమానం అయ్యింది. విచిత్రం ఏమిటంటే ఈ చిత్రం పేరిట ఉన్న రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
Also Read: Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ : ఓ వైపు పగ.. మరోవైపు ప్రేమ.. బింధుమాధవితో అఖిల్ కథేంటి?
సూపర్ స్టార్ కృష్ణ :
తెలుగు సినిమా హిస్టరీలోనే ఎక్కువ సార్లు త్రిబుల్ రోల్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించారు కృష్ణ. అసలు త్రిపాత్రాభినయం ఒక్క సినిమాలో చేయడమే కష్టం అనుకుంటే.. కృష్ణ మాత్రం ఏకంగా 7 సినిమాల్లో త్రిపాత్రాభినయంలో కనిపించారు.
ఫస్ట్ టైమ్ 1978 లో కృష్ణ మూడు పాత్రల్లో నటించిన సినిమా ‘కుమార్ రాజా’. ఆ తర్వాత 1982లో ‘పగబట్టిన సింహం’, ‘డాక్టర్ సినీ యాక్టర్’ అనే రెండు చిత్రాల్లో కృష్ణ త్రిబుల్ రోల్ లో నటించారు.
ఇక 1983లో సిరిపురం మొనగాడు అనే సినిమాలో నాలుగోసారి కృష్ణ త్రిబుల్ రోల్ లో కనిపించారు. మళ్ళీ 1984లో రక్తసంబంధం, బంగారు కాపురం అనే రెండు సినిమాల్లో త్రిబుల్ రోల్స్ లో కనిపించారు.
అలాగే 1997లో 7వ సారి బొబ్బిలి దొర అనే సినిమాలో త్రిబుల్ రోల్ చేశారు. అయితే, కృష్ణకి త్రిబుల్ రోల్ కలిసి రాలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ ఎక్కువగా ప్లాపే అయ్యాయి.
అలనాటి అందాల హీరో శోభన్ బాబు :
అలనాటి అందాల హీరో శోభన్ బాబు కూడా 1983లో ముగ్గురు మొనగాళ్ళు అనే చిత్రంలో మొట్టమొదటి సారిగా త్రిబుల్ రోల్ లో నటించారు. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి కూడా 1994లో ముగ్గురు మొనగాళ్ళు అనే చిత్రంలో మూడు పాత్రల్లో నటించి మెప్పించారు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. ఈ చిత్రం గురించి అంతా విశేషంగా చెప్పుకున్నారు .
నట సింహం బాలయ్య బాబు :
బాలయ్య బాబు 2012లో ‘అధినాయకుడు’ అనే చిత్రంలో మొదటిసారిగా త్రిబుల్ రోల్ లో నటించారు. ఈ సినిమా జస్ట్ యావరేజ్ గా ఆడింది.
జూనియర్ ఎన్టీఆర్ :
జూనియర్ ఎన్టీఆర్ 2017లో ‘జై లవకుశ’ అనే చిత్రంలో మూడు పాత్రల్లో నటించి మెప్పించారు. కేవలం ఎన్టీఆర్ నటన కారణంగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
అయితే, నిజానికి త్రిబుల్ రోల్ తెలుగు తెర పై పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే టాలీవుడ్ లో త్రిబుల్ రోల్ చేసిన చాలా సినిమాలు ఎక్కువ శాతం ప్లాప్ అయ్యాయి. కాకపోతే, సీనియర్ ఎన్టీఆర్ కి – జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఈ త్రిపాత్రాభినయం అద్భుతమైన పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి.
Also Read: Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ వివాదం పై ‘ఆలియా భట్’ స్పందన