Maata Vinali Song : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. 90 శాతంకి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కేవలం 8 రోజుల షూటింగ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని రేయింబవళ్లు శ్రమించి పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో బాబీ డియోల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమా నుండి ‘మాట వినాలి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకి ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు.
మొదటి రోజు 20 మిలియన్ కి పైగా వ్యూస్ ని రాబట్టి సంచలనం సృష్టించిన ఈ పాట, ఇప్పుడు అన్ని భాషలకు కలిపి 40 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా గత 100 గంటల నుండి ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ లో నాన్ స్టాప్ గా నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఇది తెలుగు సినిమాల్లో ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ పాట బాగా వైరల్ అయ్యింది. రోజుకి వెయ్యి మందికి పైగా రీల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా పలువురు సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈ పాటలకు రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. ‘మాట వినాలి’ అనే పదాన్ని మనం ఎదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాము. అలా రెగ్యులర్ వాడే పదం కాబట్టే దీనికి ఇంతటి రెస్పాన్స్ వచ్చింది.
పైగా పవన్ కళ్యాణ్ పాడే ఫోక్ సాంగ్స్ కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఇతర హీరోల అభిమానులు కూడా ఆయన పాడే ఫోక్ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. గతంలో ఆయన ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడాడు. వాటికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ‘కాటమరాయుడా’ సాంగ్ ఆ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల యువతని ఒక ఊపు ఊపింది. ఆ సాంగ్ రేంజ్ లో ‘మాట వినాలి’ సాంగ్ క్లిక్ కాకపోయినా స్లో పాయిజన్ లాగ ఆడియన్స్ కి ఎక్కుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పాట ఫుల్ రన్ లో వంద మిలియన్ వ్యూస్ ని కైవసం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఒక మేకింగ్ వీడియో ని అతి త్వరలోనే మేకర్స్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. శివరాత్రికి ఈ మేకింగ్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
