Tragedy : హీరో సూర్య పుట్టినరోజు నాడు విషాదం చోటు చేసుకుంది. ఆయన అభిమానులు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన అభిమాన వర్గాలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జులై 23న సూర్య జన్మదినం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెం కి చెందిన సూర్య అభిమానులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సూర్య ప్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ముగ్గురు యువకులు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఇద్దరు అక్కడిక్కకే మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అభిమానిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మృతులు నక్క వెంకటేష్, పోలూరు సాయి అని సమాచారం. వీరు డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులు. ఇద్దరు యువకుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆనందంగా జరుగుతున్న అభిమాన హీరో జన్మదిన వేడుకలు విషాదాంతం అయ్యాయి.
గతంలో కూడా ఎలాంటి ప్రమాదాలు అనేక జరిగాయి. అభిమానం పేరుతో యువకులు చర్యలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫ్లెక్స్ లు కట్టే క్రమంలో విద్యుత్ షాక్ కి గురవడం, ఎత్తైన ప్రదేశాల నుండి జారిపడటం పరిపాటిగా మారింది. యువకుల్లో ఈ విషయమై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాగా సూర్య జన్మదినం పురస్కరించుకుని ఆయన లేటెస్ట్ మూవీ కంగువ టీజర్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోనే కంగువ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా సూర్య ఐదు భిన్నమైన పాత్రలు చేయడం విశేషం. కంగువ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్లో తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.