Toxic Movie Release Date: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ తరహా సినిమాలైతే వస్తున్నాయి. వాటిని చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి వచ్చే సినిమాలు సైతం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిన యశ్ కే జి ఎఫ్ సినిమాతో ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాడో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు యశ్ హీరోగా టాక్సిక్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా జూన్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాని ఆగస్టు 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక దాంతో ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు కొంతవరకు డైలమాలో పడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడేట్ ప్రేక్షకులందరికి ఉంది. మరి ఆ సినిమాతో పాటుగా టాక్సిక్ సైతం ఎలాంటి పెను ప్రభంజనాలను క్రియేట్ చేయగలుగుతుంది అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇరుముడి సినిమాకి టాక్సిక్ నుంచి ఏదైనా పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఆల్రెడీ టాక్సిక్ కంటే కూడా ఇరుముడి సినిమా నాలుగు రోజులు ముందు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం టాక్సిక్ వచ్చి ఇరుముడి సినిమాను పూర్తిగా డామినేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’ సినిమాను సైతం ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు… టాక్సిక్ సూపర్ హిట్ అయితే మాత్రం భోగి సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి భోగి సినిమాని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…
