Toxic Movie: వచ్చే నెల 19 న పాన్ ఇండియన్ లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2), ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇవి ఒకే రోజున విడుదలైతే కచ్చితంగా రెండు సినిమాలకు నష్టం ఉంటుంది. ముఖ్యంగా ‘టాక్సిక్’ చిత్రానికి ఎక్కువ నష్టం ఉండొచ్చు. నార్త్ ఇండియా లో షోస్ ని దక్కనివ్వకుండా చేసేస్తారు అక్కడి నిర్మాతలు. పైగా ‘ధురంధర్ 2’ చిత్రాన్ని సమర్పిస్తుంది మరెవరో కాదు, ‘జియో స్టూడియోస్’ సంస్థ. థియేటర్స్ మాఫియా విషయం లో వీళ్ళని కొట్టే వాళ్ళు బాలీవుడ్ లో ఎవ్వరూ లేరు. వాళ్లకు కావాల్సినన్నీ షోస్ , థియేటర్స్ ని సొంతం చేసుకోగలరు, అదే సమయంలో తమకు పోటీ వచ్చే సినిమాలను నార్త్ ఇండియా లో అడ్డంగా తొక్కేయగలరు.
ఈ భయం ఇప్పుడు ‘టాక్సిక్’ టీంలో కూడా మొదలైంది. రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత ఒక మీడియా ప్రతినిధి ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడట. ‘ధురంధర్ 2’ మూవీ టీం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. వాళ్ళు మాకు మార్చి 19 న వస్తున్నాం అనే విషయాన్నీ అసలు చెప్పలేదు. ఇప్పుడు క్లాష్ కి వెళ్తే ఇద్దరికీ నష్టమే, కనీసం వాళ్ళు మాతో చర్చిండానికి కూడా ఇష్టం చూపడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. మరి ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రాన్ని ధైర్యం చేసి మార్చి 19 న విడుదల చేస్తారా?, లేకపోతే వాయిదా వేసుకుంటారా అనేది చూడాలి. అయితే ఈ సినిమాని వాయిదా వేస్తే హీరో యాష్ ఒప్పుకునే పరిస్థితి లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతం లో కూడా యాష్ తన ‘KGF చాప్టర్ 1’ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ ‘జీరో’ మూవీ కి పోటీగా దింపాడు. KGF కి అప్పట్లో థియేటర్స్ దక్కకుండా తొక్కే ప్రయత్నం చాలానే చేశారు.
కానీ చివరికి కంటెంట్ ఉన్న సినిమాదే విజయం అన్నట్టు, KGF చిత్రం విజయం సాధించింది. ఈసారి కూడా అలాగే ముందుకు పోదాం అనే ధోరణితో ఉన్నాడు యాష్. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ‘ధురంధర్ 2’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదట. చాలా సన్నివేశాలు బ్యాలన్స్ ఉన్నాయట. సినిమా విడుదల తేదికి పట్టుమని నెల రోజుల సమయం కూడా లేదు. దీనిని బట్టీ చూస్తుంటే, ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.