Homeఎంటర్టైన్మెంట్Toxic Movie 2026 Teaser: 'టాక్సిక్' లో ఐదుగురు హీరోయిన్లు..కానీ టీజర్లో ఒక్కరిని కూడా చూపించలేదు..కారణం...

Toxic Movie 2026 Teaser: ‘టాక్సిక్’ లో ఐదుగురు హీరోయిన్లు..కానీ టీజర్లో ఒక్కరిని కూడా చూపించలేదు..కారణం ఏంటంటే!

Toxic Movie 2026 Teaser: కన్నడ సూపర్ స్టార్ యాష్(Rocking star Yash) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్'(Toxic Movie) వచ్చే నెల 19న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని మేకర్స్ నేడు విడుదల చేశారు. యాష్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన టీజర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో ఆ టీజర్ కి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ ని పెంచిన టీజర్ అది. కానీ నేడు విడుదల చేసిన టీజర్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. వయొలెన్స్ తప్ప, అసలు ఈ సినిమాలో ఏమి లేనట్టు ఉంది అంటూ ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 మంది హీరోయిన్లు ఉన్నారు.

కానీ ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్స్ లో ఒక్కరిని కూడా చూపించకపోవడం గమనార్హం. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇందులో ఒక పవర్ ఫుల్ పాత్ర పోషించింది. ఆమె విడుదల చేసిన రెండు టీజర్స్ లో ఒక్క షాట్ లో కూడా కనిపించకపోవడం గమనార్హం. అదే విధంగా ఈ చిత్రం లో కియారా అద్వానీ, రుక్మిణి వాసంత్ వంటి క్రేజీ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఒక్క షాట్ లో కూడా కనిపించకపోవడం అభిమానులకు నిరాశని మిగిలించింది. నేడు విడుదల చేసిన టీజర్ లో ఒకే ఒక్క షాట్ లో యాష్, రుక్మిణి వసంత్ తో రొమాన్స్ చేస్తున్నట్టు చూపించారు. కానీ ఆమె ముఖాన్ని చూపించలేదు. కేవలం నెటిజెన్స్ గుర్తుపట్టి ఈమె రుక్మిణి వాసంత్ అని పోస్టులు చేస్తే కానీ ఈ టీజర్ లో ఆమె ఉంది అనే విషయాన్ని గుర్తుపట్టలేకపోయారు జనాలు.

వీళ్ళతో పాటు హుమా ఖురేషి, తార సుతారియా వంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇంత మంది క్రేజీ హీరోయిన్స్ ని పెట్టుకొని కూడా, ఒక్కరిని చూపించలేదంటే అర్థం ఏంటి?, అంటే వీళ్లకు సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేదా. నయనతార ఒక సినిమా ఒప్పుకోవాలంటే తన పాత్ర బలంగా ఉంటేనే ఒప్పుకుంటుంది, అలాంటి హీరోయిన్ కి సినిమాలో తక్కువ స్పేస్ ఉంటుంది అంటే నమ్మడానికి కష్టమే. ఇక మిగిలిన హీరోయిన్స్ అందరూ కూడా మంచి ఫార్మ్ లో ఉన్నారు. అయినప్పటికీ ఈ చిత్రం లో వాళ్ళ పాత్రలకు విలువ లేదా?, వెయ్యి కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న పాన్ ఇండియా సినిమా అవ్వడంతో కేవలం అందులో భాగం అయ్యేందుకు వీళ్లంతా నటించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular