Famous Actress: ఆమె తెలుగు సినిమాల ప్రస్తుత మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రెస్. మొదట్లో ఆమె ఐటమ్ సాంగ్స్ లో కూడా దుమ్ము దులిపింది. ఆ తర్వాత అవకాశాలు రాక, సైడ్ ట్రాక్స్ ను నమ్ముకుని, సైడ్ క్యారెక్టర్స్ తో ఫేమస్ అయ్యింది. మధ్యలో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా, ఈ నటికి అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, అదృష్టం బాగుండి.. మొత్తానికి తల్లి పాత్రలకు ప్రధాన ఆప్షన్ గా అయ్యింది. ఎక్కువగా పవిత్రమైన పాత్రల్లో కనిపించే ఈమె, ఈ మధ్య మత్తుకు బానిస అయ్యింది.

చూడటానికి చాలా డీసెంట్ గా కనిపించే ఈ నటికి, ప్రస్తుతం మందు కొట్టడం అనేది, టీ తాగడం అన్నంత కామన్ అయిపోయింది. ఆమె గత కొన్ని రోజులుగా విపరీతమైన టెన్షన్లతో, స్ట్రెస్ కు లోనవుతుంది. ఓ మేనేజర్ కమ్ ఫైనాన్సియర్ ను నమ్మి.. సంపాదించింది మొత్తం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమె అలవాట్లులో ఇలాంటి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆ చిన్న విషయాన్ని మీరు గుర్తించారా?
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆమెను ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరకు తీసుకున్నాడు. ఈయన గారు గతంలో హీరోగా కూడా కొన్ని కామెడీ సినిమాలు చేశాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ ఫేమస్. ఈయన తల్లి ఓ దిగ్గజ దర్శకురాలు కూడా. ఈయనగారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని.. వాటిని సమర్థవంతంగా పెటాకులు చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన తన పైత్యాన్ని మొత్తం ఆమెకు కూడా అంటించాడు.
దాంతో ఆమె అడ్డు అదుపు లేకుండా మత్తులో రెచ్చిపోతుంది. సినిమా సెట్స్ కి కూడా లైట్ మత్తు పానీయం సేవించి వస్తోంది. ఇదెక్కడి గోలరా బాబు అంటూ డైరెక్టర్లు ఇప్పటికే ఆమెను పక్కన పెడుతున్నారు. దాంతో అవకాశాలు తగ్గాయి. ఖాళీగా ఉంటుంది. దాంతో, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంట్లోనే తెల్లవారుఝమున రెండు గంటలు దాటే వరకు సిట్టింగ్ వేసి మరీ, గ్లాస్ మీద గ్లాస్ లాగించేస్తోంది.
చేతిలో వున్న డబ్బు పోయింది, ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు కూడా పోతే ఏమిటి పరిస్థితి ? అన్నిటికి మించి తెల్లార్లూ మందు కొట్టుకుంటూ పోతే ముందు ఆరోగ్యం పాడవుతుంది. ఈ చిన్న లాజిక్ ఈ నటి మిస్ అవ్వడం బాధాకరం.
Also Read:RRR Creating Records In OTT: OTT లో కూడా ప్రభంజనం సృష్టించిన #RRR.. ఎంత వసూలు చేసిందో తెలుసా..?



[…] […]