Manchu Lakshmi- Bhuma Maunika: తమ్ముడు మనోజ్ వివాహాన్ని మంచు లక్ష్మి ఘనంగా చేశారు. మనోజ్-మౌనికల పెళ్ళికి అన్నీ తానై వ్యవహరించారు. మార్చి 3వ తేదీన మనోజ్-భూమా మౌనికల వివాహం మంచు లక్ష్మి నివాసంలో జరిగింది. ఈ పెళ్ళికి పరిశ్రమ నుండి అతికొద్ది మంది ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ బాబు సతీసమేతంగా విచ్చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లికి చివరి నిమిషంలో మోహన్ బాబు రావడంతో ఆయనకు ఇష్టం లేని మాట వాస్తమే అన్న వాదనలు వినిపించాయి. తాజాగా మనోజ్-మౌనికల పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలను మంచు లక్ష్మి తెలియజేసింది.
ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి మాట్లాడుతూ… మనోజ్ నాకు కష్టం వచ్చిందంటే ముందుంటాడు. మనోజ్- మౌనికల వివాహం జరగాలని కోరుకున్నాను. యాదాద్రిలో మా నాన్న మనసు మార్చి వాళ్ళ పెళ్లి జరిగేలా చూడమని మొక్కుకున్నాను. ఆయన నా మొర ఆలకించారు. మౌనికతో మనోజ్ వివాహం జరిగింది. మా రెండు కుటుంబాలకు గొప్ప నేపథ్యం ఉంది. కుటుంబ సభ్యులు మౌనిక, మనోజ్ లను నమ్మడానికి సమయం పట్టింది.
నిజంగా వీరికి పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అనుకున్నారు. వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆపడానికి మనం ఎవరు? పెళ్లయ్యాక ఇద్దరినీ యాదాద్రి తీసుకెళ్లి దర్శనం చేయించాను. పెళ్లి అయ్యే వరకూ నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వేరుగా మరొక ఇంట్లో కాపురం పెట్టారు. మౌనిక ఫోన్ చేసి అదెలా చేయాలి? ఇదెలా చేయాలి? అని అడుగుతుంది. నేను చెప్పకుండా టార్చర్ చేస్తుంటాను. నా దగ్గర ఉన్నప్పుడు అడిగావా? అని ఎద్దేవా చేస్తాను, అని మంచు లక్ష్మి అన్నారు.
ఆమె మాటలను బట్టి మోహన్ బాబు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మంచు విష్ణు ఈ వివాహానికి దూరంగా ఉన్నారు. తమ్ముడు మనోజ్ తో కోల్డ్ వార్ నడుస్తోంది. మంచు లక్ష్మి ఇంకా మాట్లాడుతూ తనకు పిల్లలు అంటే ఇష్టం అన్నారు. ముగ్గురు, నలుగురు పిల్లలకు తల్లి అవ్వాలని కోరుకుందట. దేవుడు ఒక పాపను మాత్రమే ఇచ్చాడని ఒకింత నిరాశ వ్యక్తం చేసింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది.