https://oktelugu.com/

సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య?

బాలీవుడ్‌ కథానాయకుడు.. వరుస హిట్లతో దూసుకుపోతున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలనూ కుదిపేసింది. బాలీవుడ్‌.టాలీవుడ్‌, కోలివుడ్‌ అని తేడాలేకుండా అన్ని చిత్ర పరిశ్రమలూ ఆయన మరణంపై దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి. వరుస విజయాలు.. తిరుగులేని స్టార్‌‌డమ్‌.. మూడు పదుల వయసులోనే బాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు సుశాంత్‌. ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడని టాక్ ఉంది.. ఏ హీరోకైనా ఇంతకన్నా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 03:45 PM IST

    sushant case

    Follow us on

    బాలీవుడ్‌ కథానాయకుడు.. వరుస హిట్లతో దూసుకుపోతున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలనూ కుదిపేసింది. బాలీవుడ్‌.టాలీవుడ్‌, కోలివుడ్‌ అని తేడాలేకుండా అన్ని చిత్ర పరిశ్రమలూ ఆయన మరణంపై దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి. వరుస విజయాలు.. తిరుగులేని స్టార్‌‌డమ్‌.. మూడు పదుల వయసులోనే బాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు సుశాంత్‌. ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడని టాక్ ఉంది.. ఏ హీరోకైనా ఇంతకన్నా ఇంకేం కావాలి. మరి ఇవన్నీ ఆయన మరణాన్ని ఎందుకు ఆపలేకపోయాయి..? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..?

    Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్

    అయితే సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ అతని కుటుంబ సభ్యులు మొదటి నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. దీనిపై కంప్లయింట్‌ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి కూడా అప్పజెప్పారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సుశాంత్‌ సింగ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇందులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో రియాను అరెస్టు కూడా చేశారు. మరికొంత మందికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఇంకొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.

    అయితే.. తాజాగా ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యతోపాటు అతడి స్నేహితులు, కుటుంబం మరియు సిబ్బందిని కూడా చంపాలని డ్రగ్స్‌ మాఫియా స్కెచ్‌ వేసినట్లు సమాచారం. మొత్తం 11 హత్యలు చేయడానికి ప్లాన్‌ చేశారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ డ్రగ్స్‌ మాఫియా బాలల అక్రమ రవాణా, వ్యభిచారం, మాదకద్రవ్యాలు, మాఫియాస్‌, ఉగ్రవాదం, నేపాటిజం, బెట్టింగ్‌ రాకెట్‌, సైబర్‌‌ క్రైమ్‌లను కూడా చేస్తుంటుందని సమాచారం. డ్రగ్స్ ఊబిలో కూరుకు పోయిన సుశాంత్ దీన్నుంచి బయటపడడానికి తనకు తెలిసిన నిజాలు అన్నీ బయటపెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ దందాలో పెద్ద పెద్ద స్టార్లతోనూ సంబంధాలున్నాయని తెలుస్తోంది. దీంతో అందరి పుట్టి మునుగుతుందని తెలిసి సుశాంత్ నే లేకుండా చేశారనే ప్రచారం ఉంది.

    వీటన్నింటినీ సుశాంత్‌ ఎక్కడ బయట పెడుతాడోనని మాఫియా ఈ హత్యల ప్లాన్‌ చేసిందని కథనాలు వినిపిస్తున్నాయి. సుశాంత్ నిజాలు చెప్పడానికి రెడీ అయినందుకే ఆయనను చంపేశారని, అతనితోపాటే మరో 11 హత్యలకు ప్లాన్‌ చేశారని ఆ వార్తల సారాంశం.

    Also Read: మరో సీనియర్ నటికి కరోనా !

    సుశాంత్‌ మర్డర్‌‌ ప్రకంపనలు కాస్త ఇప్పుడు టాలీవుడ్‌నూ అంటుకున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌ హత్య వెనుక పలువురు బాలీవుడ్‌ స్టార్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఒక ప్రముఖ తెలుగు హీరో భార్యను కూడా దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీ పిలిపిస్తున్నట్లుగా సమాచారం. వారిని కూడా విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అందుకే.. ఈ చిన్న క్లూ దొరికినా ఎన్‌ఐఏ తన దర్యాప్తును ఆ దిశగా నడిపిస్తోంది.

     
    ఇంతకీ సుశాంత్‌ది హత్యనేనా..? ఒకవేళ హత్య అయితే అందులో ఎవరెవరి భాగస్వామ్యముంది..? వార్తలు వస్తున్నట్లు బాలీవుడ్‌ స్టార్లు కూడా ఇందులో పాలు పంచుకున్నారా..? ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.