Producers : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ కి భారీగా లాభాలు వస్తాయి. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వాళ్లకు కొంత వరకు నష్టాలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ల సినిమాలను చేస్తున్నప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా సూపర్ సక్సెస్ అయితే పర్లేదు. కానీ సినిమా బోల్తా కొడితే మాత్రం వాళ్ళు భారీగా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. రీసెంట్ గా దిల్ రాజు (Dil Raju)కూడా ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో 300 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవడం విశేషం… మరి ఈ సినిమా కలెక్షన్స్ భారీ గా తగ్గిపోవడంతో దిల్ రాజు కొంతవరకు నష్టాన్ని చవిచూశాడనే చెప్పాలి. కానీ సంక్రాంతి కానుకగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ అనే సినిమా సూపర్ సక్సెస్ అయి 200 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం వల్ల ఈ సినిమాలో ఏదైతే లాస్ వచ్చిందో ఆ సినిమాతో కవర్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లందరూ పెద్ద హీరోలతో సినిమాలను చేస్తూనే మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేసి సేఫ్ జోన్ లో ఉండాలనే ఒక ప్రణాళికను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు…దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు నితిన్ తో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా పట్టాలెక్కిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత అయిన నాగ వంశీ సైతం ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి వారితో మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక వాటితో పాటుగా ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా అలాగే మ్యాడ్ 2, రవితేజతో ‘మాస్ జాతర’ అనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక వీళ్లతో పాటుగా మరో పెద్ద ప్రొడక్షన్ హౌజ్ అయిన గీతా ఆర్ట్స్ సైతం తనతో తండేల్ అనే సినిమా చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉంచారు. ఇక వీళ్ళతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి భారీ సినిమాలను తీసి భారీ లాభాలను అందుకున్నప్పటికి ఇప్పుడు వాళ్ళ బ్యానర్ లో నితిన్ తో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నారు.
ఇక యూవీ క్రియేషన్స్ వాళ్లు సైతం చిరంజీవితో విశ్వంభర అనే పెద్ద సినిమా చేస్తున్నప్పటికి సేఫ్ సైడ్ గా మేర్లపాక గాంధీ వరుణ్ తేజ్ కాంబోలో మరొక సినిమాని కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ అందరు పెద్ద సినిమాలు చేస్తూనే మీడియం బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల ఒక సినిమాలో నష్టం వచ్చిన మరొక దాంట్లో లాభాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు…