Anchor Vishnu Priya: బుల్లితెర, వెండితెర అనే తేడా లేదు. అమ్మాయిలున్న ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఇప్పుడు టాప్ స్టార్స్ గా వెలిగిపోతున్న హీరోయిన్స్ అందరూ ఈ వేధింపులు ఎదుర్కొన్నవారే. అనేక మంది మగాళ్ల వికృత చేష్టలు చూసినవారే. అయితే దీని గురించి ఎవరూ మాట్లాడరు. ఫలానా హీరో, నిర్మాత, డైరెక్టర్ లైంగికంగా వేధించాడని బయటపడరు. కారణం… కెరీర్ గల్లంతు అవుతుందనే భయం. ఓపెన్ గా ఆరోపణలు చేస్తే కెరీర్ పై ఆశలు వదులుకోవాల్సిందే. సదరు హీరోయిన్స్ కి ఎవరూ అవకాశాలు ఇవ్వరు. ఒక హీరోయిన్ నాకు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురు కాలేదని చెప్తే… అది పచ్చి అబద్దమే. ఏదో ఒక దశలో ఎవరో ఒకరి నుండి ప్రతి హీరోయిన్ కి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవుతాయి.

ఇప్పటికే పలువురు హీరోయిన్స్ లైంగిక వేధింపులపై ధైర్యంగా మాట్లాడారు. హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్ కి… అక్కడి నుండి టాలీవుడ్ కి విస్తరించింది. శ్రీరెడ్డి లాంటి హీరోయిన్స్ ఆధారాలతో సహా కొందరి చీకటి జీవితాలు బహిర్గతం చేశారు. తాజాగా యాంకర్ కమ్ నటి విష్ణుప్రియ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. ఆమెకు కూడా ఈ తరహా వేధింపులు ఎదురైనట్లు ఒప్పుకున్నారు.
Also Read: Tamil Actress Deepa: అతన్ని జీవితాంతం ప్రేమిస్తానంటూ లెటర్ రాసి యువ నటి ఆత్మహత్య
ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ మాట్లాడుతూ… టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. అలాగే ఒక టాప్ డైరెక్టర్ ఆఫర్ ఇస్తా పక్కలోకి రమ్మన్నాడు. కోరిక తీర్చమన్నాడని ఆమె ఓపెన్ అయ్యారు. బెడ్ పైకి వస్తే అవకాశం ఇస్తానని ఆ డైరెక్టర్ అనడంతో షాక్ తిన్నాను అన్నారు. అయితే అతడి మాటలు నాకు కోపం తెప్పించాయి. అలాంటి చెత్త పనులు చేస్తే వచ్చే ఆఫర్స్ నాకు అవసరం లేదు. నేను అలాంటి అమ్మాయిని కాదని ముఖం మీద నేరుగా చెప్పానని విష్ణుప్రియ అన్నారు.

క్యాస్టింగ్ కౌచ్ పై విష్ణుప్రియ చేసిన కామెంట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమెను ఇబ్బంది పెట్టిన ఆ టాప్ డైరెక్టర్ ఎవరనే ఆలోచనలో జనాలు పడ్డారు. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ ‘పోవే పోరా’ షోతో యాంకర్ గా మారారు. ఆ షోతో ఆమెకు కొంత పాపులారిటీ దక్కింది. ఇటీవల ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అమ్మడు స్కిన్ షో చేస్తూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ ఉంటారు.
Also Read: Samantha: అమెరికాలో సమంత కి స్కిన్ ట్రీట్మెంట్.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు సమంతకు ఏమైంది ?
Recommended videos:
[…] […]