Bigg Boss OTT: తెలుగు రియల్టీ షోల్లో ‘బాగ్ బాస్’ షోకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని రోజులపాటు ఒకే హౌస్ లో సాగే ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్, టాస్కులు, గొడవలు, వివాదాలన్నీ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ షోకు సీజన్ సీజన్ కు ఆదరణ పెరుగుతూ పోయింది.
ఇప్పటికే ‘బిగ్ బాస్’ షో ఐదు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే ఈ షో నిర్వాహాకులు వినూత్నంగా ఈసారి ఓటీటీలో ప్రసారానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈసారి బిగ్ బాస్ టీవీ ఛానళ్లలో కాకుండా ఓటీటీ వర్షన్లో మాత్రమే ప్రసారం కానుంది. బిగ్ బాస్ తొలి ఓటీటీ వర్షన్ కు సైతం హీరో నాగార్జుననే హోస్టుగా చేయనున్నాడు.
బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులోని పాల్గొనే కంటెస్టెంట్లపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ప్రముఖ యాంకర్ శ్రీముఖిని బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో భాగం చేయాలని నిర్వాహకులు భావించారని తెలుస్తోంది. అయితే ఇంతకు ముందుగానే ఆమె కమ్మింట్లకు ఒప్పుకోవడంతో డేట్స్ అడ్జస్ట్ కావడం లేదట. దీంతో బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ను శ్రీముఖి రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో 14మంది కంటెస్టెంట్లతోపాటు కొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. భారీ రెమ్యూనరేషన్ కాకుండా తక్కువలో పారితోషికం తీసుకునే వారి కోసం ఇప్పటికే నిర్వాహకులు వేట మొదలు పెట్టారు. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, గీతా మాధురి, యాంకర్ శివ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నారు. ఇక ఈ షో ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం డీస్నీ హాట్ స్టార్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు నిర్వాహాకులు చకచకా చేస్తున్నారు.