NTR Ram Charan: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ గా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వడంతో ఎన్టీఆర్ – చరణ్ బాగా నిరుత్సాహ పడ్డారని.. ఇద్దరూ ప్రస్తుతం పూర్తి నిరాశలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ – చరణ్ నిజంగానే బాధలో ఉన్నారా ?, అవును అంటున్నారు నెటిజన్లు కూడా. సినిమా పోస్ట్ ఫోన్ అయిన తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఎక్కడా బయట కనపడలేదు.

చివరకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ కామెంట్స్ కి ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని.. మొత్తానికి ఇద్దరు హీరోలు పూర్తి బాధలో ఉన్నారని తేల్చి చెబుతున్నారు గాసిప్ రాయుళ్లు. ఎన్టీఆర్ -చరణ్ బాధకు మరో కారణం కూడా రీజన్ గా చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి వీరిద్దరూ కట్టుబడి ఉన్నాడు. ఎన్టీఆర్ – చరణ్ ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఇప్పటికే నాలుగేళ్ల కాలాన్ని వృధా చేశారు.
నాలుగేళ్లు అంటే కనీసం నాలుగు సినిమాలు చాలా ఈజీగా చెయ్యొచ్చు. ఒక్కో సినిమాకు ఇద్దరు చేరే 50 కోట్లు వేసుకున్నా… 400 కోట్ల పారితోషికం వీరిద్దరికి మిస్ అయింది. సరే, పాన్ ఇండియా ఇమేజ్ వస్తే.. నాలుగు సినిమాలకు సంపాదించేది ఒక్క సినిమాకే సంపాదించొచ్చు అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే నాలుగు సార్లు పోస్ట్ ఫోన్ అయింది.
ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఈ లెక్కన ఒక్క సినిమా కోసం ఐదేళ్లు సమయాన్ని వృధా చేసుకున్నారు. అందుకే..పాన్ ఇండియా ఇమేజ్ వస్తోంది అనే అనందం కంటే.. కోల్పోయిన సమయాన్ని తల్చుకునే ఎన్టీఆర్ – చరణ్ బాధ పడుతున్నారట. సరే ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ మధ్య వచ్చే ఫైట్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని ఎప్పటి నుంచో ఓ వార్త బాగా వినిపిస్తోంది.
Also Read: RGV: ఆర్జీవీ మాములోడు కాదు.. మంత్రి పేర్నినాని అపాయింట్ మెంట్ దొరికిందిగా..!
కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా బీమ్ – రామరాజు ఒకరి పై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోందని, ఆ దాడికి సంబంధించి వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తెలుగు వెండితెర పైనే గొప్ప విజువల్ ఫైట్ గా ఉంటుందని గతంలో విజయేంద్రప్రసాద్ చెప్పారు. అన్నట్టు పబ్లిసిటీ కోసం ఆర్ఆర్ఆర్ టీం భారీగా ఖర్చు పెట్టింది. ఇక హీరోలు, దర్శకుడు, అలాగే నిర్మాత కూడా చాలా కష్టపడ్డారు. కానీ చివరకు సినిమా పోస్ట్ ఫోన్ అయింది. చివరకు ప్రమోషన్స్ కోసం పెట్టిన డబ్బులన్నీ వృధా అయ్యాయి.
Also Read: Pushpa 2: ‘పుష్ప రాజ్’ కోసం మరో హీరోయిన్ రెడీ.. ఇక ఫుల్ రొమాన్సే !