Top 5 Highest Grossing Telugu Movies: 2025 వ సంవత్సరం ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ శాతం తక్కువే. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు బోల్తా కొట్టాయి. మీడియం రేంజ్ సినిమాలే ఎక్కువగా ఆదరణ పొందాయి. ఒకపక్క భారీ అంచనాల మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కమర్షియల్ గా హిట్ అయితే, మరోపక్క అదే రేంజ్ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది. ఓవరాల్ గా ఈ ఏడాది టాప్ 5 గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఓజీ(They Call Him OG) :
పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సుజిత్(Sujith) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్కడ ఈ సినిమా అభిమానులను అసంతృప్తి పరుస్తుందో అనే చిన్న భయం బయ్యర్స్ లో ఉండేది, కానీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా నిల్చి, దాదాపుగా 325 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సింగిల్ లాంగ్వేజ్ నుండి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు.
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam):
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా సంక్రాంతి రేస్ లో మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచి దాదాపుగా 265 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సీనియర్ హీరో సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించలేకపోయారు. దిల్ రాజు ని ‘గేమ్ చేంజర్’ నష్టాల నుండి బయటపడిన సినిమా ఇది.
గేమ్ చేంజర్(Game Changer) :
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ రామ్ చరణ్ కి ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉండడం తో ఈ సినిమాకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫ్లాప్ అయితేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక సూపర్ హిట్ అయ్యుంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడ ఉండేదో మీరే ఊహించుకోండి.
మిరాయ్(Mirai):
‘హనుమాన్’ వంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత, దేవుడు అంశం పై తెరకెక్కిన తేజ సజ్జ(Teja Sajja) చిత్రం ‘మిరాయ్’. అప్పటి వరకు సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతున్న కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడిగా మారడం విశేషం. మంచు మనోజ్ ఈ చిత్రం లో విలన్ గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 143 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కుబేర(Kubera) :
శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush K Raja) హీరోలుగా నటించిన ‘కుబేర’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న అక్కినేని నాగార్జున కి సరికొత్త ఊపుని ఇచ్చిన చిత్రమిది. తెలుగు వెర్షన్ లో సూపర్ హిట్ అయ్యింది కానీ, తమిళ వెర్షన్ లో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ట్రేడ్ విశ్లేషకులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 138 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.