Kantara 2: భారీ అంచనాల నడుమ దసరా కానుకగా విడుదలైన ‘కాంతారా 2′(Kaantara : Chapter 1) చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇంకా ఈ చిత్రం తెలుగు లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 80 రూపాయిల షేర్ వసూళ్లను లాంగ్ రన్ లో రాబట్టాల్సి ఉంటుంది. ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా అంటే ప్రస్తుతానికి అనుమానమే. కానీ కన్నడ భాషలో మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు లీక్ అయ్యింది.
ఇందులో హీరోయిన్ గా రుక్మిణీ వాసంత్(Rukmini Vasanth) నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈమె క్యారక్టర్ చాలా పవర్ ఫుల్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏమిటంటే, ఈమెనే మెయిన్ విలన్. హీరో తో సమానంగా ఈమె క్లైమాక్స్ లో ఫైటింగ్ కూడా చేస్తుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రను రిషబ్ శెట్టి ఆమెకు ఇచ్చాడు. ఆమె కూడా ఆ క్యారక్టర్ ని అల్లాడించేసింది. అయితే ఈ క్యారక్టర్ కోసం ముందుగా చాలా ఆడిషన్స్ చేసాడట రిషబ్ శెట్టి. మన టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా కొనసాగుతూ నెంబర్ 1 స్థానం లో ఉన్న శ్రీలీల ని ఈ రోల్ కోసం సంప్రదించారట. కానీ ఆమె నెగటివ్ రోల్ అవ్వడం తో రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ క్యారక్టర్ ని ఆమె ఒప్పుకొని చేసుంటే శ్రీలీల నటిగా పెద్ద స్థాయికి వెళ్ళేది.
ఈమె డ్యాన్స్ లు బాగా చేస్తుంది కానీ, యాక్టింగ్ అసలు రాదూ అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. తనపై ఉన్న ఆ రిమార్క్ ని ఈ సినిమా ద్వారా తుడిపేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది, కానీ ఆమె ఉపయోగించుకోలేదు. మరోపక్క రుక్మిణి వాసంత్ తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోలేదు. ఫలితంగా నేడు పాన్ ఇండియా లెవెల్ లో ప్రశంసలు అందుకుంది. రాబోయే రోజుల్లో ఈమెకు ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని దొరికే అవకాశం ఉంటుంది. వయస్సులో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా అందంగానే ఉంటుంది, కానీ కెరీర్ లాంగ్ రన్ ఉండాలంటే కచ్చితంగా యాక్టింగ్ టాలెంట్ ఉండాలి. ఆ విషయం లో రుక్మిణి వాసంత్ కెరీర్ ఎక్కువ సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.