Tollywood : అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నేషనల్ మీడియా సైతం ప్రముఖంగా ఈ న్యూస్ కవర్ చేసింది. అల్లు అర్జున్ కి ఉన్న పాపులారిటీ రీత్యా ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఒకరోజు జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ ని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమ మొత్తం కదలి వెళ్ళింది. దర్శకులు, నిర్మాతలు హీరోలు అల్లు అర్జున్ ని కలిసి తమ సంఘీభావం తెలియజేశారు. ఇది పరోక్షంగా తెలంగాణ గవర్నమెంట్ కి టాలీవుడ్ హెచ్చరికలు జారీ చేయడమే అంటున్నారు విశ్లేషకులు.
డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత కన్నుమూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో సంధ్య థియేటర్ లో అభిమానులతో సినిమా చూసిన అల్లు అర్జున్ ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కి ఊరట లభించింది.
హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ కాపీ అందలేదని అల్లు అర్జున్ ని శుక్రవారం రాత్రి జైలులోనే ఉంచారు. అల్లు అర్జున్ ఒక సాధారణ ఖైదీలా ఆ రాత్రి గడిపారట. కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వడంతో నేలపై పడుకున్నాడట. భోజనం కూడా చేయలేదట. మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ లో కుట్ర కోణం ఉంది. రాజకీయ కక్లో భాగం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం వెనుక కారణం ఇదే అంటున్నారు.
శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కాగా.. అల్లు అర్జున్ ని ఎలాగైనా జైలుకు తరలించాలని స్కెచ్ వేశారని అంటున్నారు. బెయిల్ వచ్చినా పేపర్ వర్క్ జాప్యం చేసి కావాలనే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలులో ఉండేలా చేశారని అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. పరిశ్రమలో నెలకొన్న ఐక్యతను తెలియజేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ ని కొందరు నటులు నేరుగానే ఖండించారు. ఇక విడుదలయ్యాక పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి కదలి వెళ్ళింది.
అల్లు అర్జున్ ని కలిసి సంఘీభావం తెలిపిన చిత్ర ప్రముఖుల లిస్ట్ చాలా పెద్దది. అల్లు అర్జున్ విడుదలను ఒక వేడుకలా పరిశ్రమ జరుపుకుంది. అదే సమయంలో ప్రభుత్వాలకు టాలీవుడ్ పంపిన ఒక హెచ్చరికలా దీన్ని చూడొచ్చు. పరిశ్రమ జోలికి రావద్దు. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తే సహించం. కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పకనే చెప్పారు. అల్లు అర్జున్ కి జరిగిందే, మనకు కూడా జరగొచ్చని భావించిన చిత్ర ప్రముఖులు మేటర్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇది అభినందనీయం..