Mana ShankaraVaraprasad Garu Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపును ఇప్పుడున్న హీరోలు కేవలం ఒక్క సినిమాతోనే సాధించేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి తనదైన రీతిలో సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళుతున్నప్పటికి ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా నటిస్తుండడం విశేషం… ఇన్ని సంవత్సరాల సినిమా కెరియర్ లో వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి నటించిన దాఖలలే లేవు.
కానీ అనిల్ రావిపూడి వాళ్ళిద్దరినీ కలిపి సినిమాలో నటింపజేస్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు ఒకవైపు ఉంటే సీనియర్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ లు ఒకటై సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమా ఎన్ని రికార్డును క్రియేట్ చేస్తోంది.
ఫలితంగా ఈ సినిమాతో చిరంజీవి కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తాడా? ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీపడే రేంజ్ లో ఈ సినిమా వసూళ్లను రాబడుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… అయితే ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవికి వెంకటేష్ కి మధ్య ఒక చిన్న ఫైట్ కూడా ఉంటుందట.
‘త్రిబుల్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కొట్టుకున్నంత వైల్డ్ గా కాకపోయిన మొత్తానికైతే ఒకరి తో ఒకరు ఫైట్ చేసుకుంటారట. ఇక ఈ ఫైట్ ను చూసి ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారు. చిరంజీవి అభిమానులు, వెంకటేశ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా తెలియాల్సి ఉంది…