https://oktelugu.com/

Rajasekhar: తెలుగు లో రాజశేఖర్ మరో విజయ్ సేతుపతి అవుతాడా..?

అయితే రాజశేఖర్ లాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అయితే ఆయన చేసిన క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని...

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2023 / 01:41 PM IST
    Follow us on

    Rajasekhar: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సీనియర్ నటులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ఇండస్ట్రీలో చాలా బిజీగా గడుపుతున్నారు.ఇక అందులో భాగంగానే జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి నటులు ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటిస్తూ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఇండస్ట్రీలో వాళ్ళకంటు ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

    అయితే రాజశేఖర్ లాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అయితే ఆయన చేసిన క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని, అదే విధంగా ఆయన కెరియర్ పరంగా రాజశేఖర్ కి కూడా ఈ క్యారెక్టర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటూ సినిమా యూనిట్ ఇప్పటికే ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ క్యారెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

    ఇంకా దీంతో పాటుగా మరి కొంతమంది ఈ క్యారెక్టర్ తో రాజశేఖర్ తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ సేతుపతి ఏ విధంగా విభిన్న క్యారెక్టర్స్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడో దానికి తగ్గట్టుగానే ఈ క్యారెక్టర్ తో రాజశేఖర్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ తో రాజశేఖర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇక సినిమా యూనిట్ కూడా ఇదే విధంగా ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ క్యారెక్టర్ గురించి మరి ఎక్కువగా చెప్తే అంచనాలు భారీ స్థాయి కి వెళ్ళిపోతాయనే ఉద్దేశ్యం తోనే ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పకుండా సినిమా యూనిట్ హోల్డ్ లో ఉంచుతున్నారు. అయితే ఈ క్యారెక్టర్ లో రాజశేఖర్ ని చూసిన తర్వాత ప్రతి సినిమాలో కూడా రాజశేఖర్ తనదైన రీతిలో వైవిధ్యమైన క్యారెక్టర్లను దక్కించుకుంటాడు అలాగే రాజశేఖర్ కోసం ప్రత్యేకంగా కొన్ని క్యారెక్టర్లు సృష్టించే విధంగా ఆయన కెరియర్ గ్రాఫ్ పెరుగుతుంది అంటూ చాలా క్లియర్ గా తెలుస్తుంది. తమిళనాడు లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ విధమైన పేరు సంపాదించుకున్నాడో ఈ క్యారెక్టర్ తో రాజశేఖర్ కూడా 100% అలాంటి గుర్తింపు సంపాదించుకొని ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తారని తెలుస్తుంది… మరి ఈ సినిమాతో రాజశేఖర్ విజయ్ సేతుపతి లెవల్లో సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…