https://oktelugu.com/

Mahesh Babu: రెండు సార్లు శంకర్ ను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. కారణం ఏంటంటే..?

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : February 22, 2024 / 01:45 PM IST
    Follow us on

    Mahesh Babu: రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే పోకిరి సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన మహేష్ బాబు ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా వరకు ట్రై చేశారు. కానీ మహేష్ బాబు మాత్రం సినిమాల విషయం లో చాలా ఆచి తుచి ముందుకు కదులాడు.

    ఇక ఇలాంటి సమయంలోనే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది ఏ సినిమా అంటే బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన ‘త్రీ ఇడియట్స్ ‘ సినిమాని శంకర్ మహేష్ బాబు తో రీమేక్ చేయాలని చూశాడు. కానీ మహేష్ బాబు మాత్రం దానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.

    దాంతో శంకర్ విజయ్ ని హీరోగా పెట్టి తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లో ‘స్నేహితుడు ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయింది. తమిళ్ లో యావరేజ్ గా ఆడింది. ఇక ఇది తెలుసుకున్న మహేష్ అభిమానులు స్నేహితుడు లాంటి ఒక భారీ ఫ్లాప్ నుంచి మహేష్ బాబు తప్పించుకున్నాడు అంటూ అప్పట్లో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కూడా మహేష్ బాబుతో ఒక స్ట్రైయిట్ తెలుగు సినిమా చేయాలని శంకర్ అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా మహేష్ బాబు శంకర్ కి అవకాశం ఇవ్వలేదు. ఇలా శంకర్ మీద మహేష్ బాబు కి మంచి ఒపీనియన్ లేదా, లేకపోతే శంకర్ తో సినిమా చేయడం ఎందుకులే అని అనుకుంటున్నాడో తెలీదు గానీ, మహేష్ బాబు మాత్రం శంకర్ ఎప్పుడు అడిగిన కూడా అతనికి అవకాశం అయితే ఇవ్వడం లేదు…