https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి వాళ్ల వదిన చెప్పిన ఆ ఒక్క మాట తో ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడా..? ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..?

రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అవడానికి గల కారణం ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే కుతూహలం అయితే ఉంటుంది. అయితే రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ మొదట కర్ణాటకలో ఉండేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 03:24 PM IST

    Who is behind Rajamouli Success

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన చేసిన ‘ బాహుబలి ‘ సినిమాతో ఒక్కసారిగా సౌత్ సినిమా స్టామినా ఏంటో నార్త్ సినిమా ఇండస్ట్రీకి తెలిసింది. అందులోనూ తెలుగు సినిమా స్టాండర్డ్ ఎలా ఉంటుందో వాళ్లకు కండ్లకు కట్టినట్టుగా కనిపించడంతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా సమయం పట్టింది.

    ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అవడానికి గల కారణం ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే కుతూహలం అయితే ఉంటుంది. అయితే రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ మొదట కర్ణాటకలో ఉండేవారు. అక్కడ వాళ్లకు దాదాపు 350 ఎకరాల భూమి ఉండేది. కానీ వాళ్ళు చేస్తున్న బిజినెస్ లలో నష్టాలు రావడం వల్ల ఉన్న భూమి మొత్తాన్ని అమ్మేసి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ కాలం గడిపేవారట… అందులో భాగంగానే విజయేంద్ర ప్రసాద్, వాళ్ల అన్నయ్య అయిన శివశక్తి దత్త ఇద్దరూ కలిసి సినిమా ఇండస్ట్రీలో సెటీలవ్వాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక వీళ్ళ ఫ్యామిలీ లో ఉన్న 13 మంది ఒకే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండేవారు. అప్పట్లో రాజమౌళి ఏ పని లేకుండా 20 సంవత్సరాల వయసు వచ్చిన కూడా నార్మల్ గా తిరుగుతూ ఉండేవాడట..

    దాంతో అందరూ రాజమౌళి ఏం చేస్తున్నాడు ఇలా అయితే కష్టమంటూ అనుకుంటూ ఉండేవారట. ఒకరోజు కీరవాణి వాళ్ళ వైఫ్ అయిన వల్లి గారు రాజమౌళిని పిలిచి ఆయనతో మాట్లాడి ఇలా ఊరికే తిరిగితే నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించే ప్రయత్నం చేయమని చెప్పారట…ఇక అప్పుడు రాజమౌళి ఎడిటింగ్ వర్క్ నేర్చుకోవడమే కాకుండా వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా కూడా జాయిన్ అయి పనిచేశాడు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు…

    ఇక ఆ తర్వాత ఆయన ‘శాంతి నివాసం ‘ అనే సీరియల్ తీసి సక్సెస్ అయ్యారు. దాంతో తనని తాను ఇంకా గొప్పగా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు… రాజమౌళి డైరెక్టర్ కావడానికి వాళ్ళ వదిన అయిన వల్లి గారు చాలా హెల్ప్ చేశారనే చెప్పాలి…అందుకే ఇప్పటికీ కూడా వల్లి గారంటే రాజమౌళి కి వాళ్ల అమ్మతో సమానం అని చెప్తూ ఉంటాడు…