Pushpa Vs Kalki: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పుష్ప సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ నైతే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక దాంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేయడానికి రెఢీ అవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే పుష్ప దాటిని తట్టుకోని నిలబడడం మరే సినిమాల వల్ల అయ్యే విధంగా కనిపించడం లేదు.
ఎందుకంటే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో అంతకుమించి సూపర్ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ నటించిన కల్కి సినిమా కూడా భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుపుకొని ఇండియా వైడ్ గా ప్రేక్షకులందరికీ ఒక విజువల్ వండర్ ను చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమం లోనే పుష్ప, కల్కి రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్ సాధించబోతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది. ఇండియా వైడ్ గా వీళ్ళ సినిమా సౌండ్ అనేది భారీ రేంజ్ లో వినిపించబోతుంది అని సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమాలే కావడం విశేషం… అయితే అల్లు అర్జున్ తో పోలిస్తే ప్రభాస్ కి పాన్ ఇండియా లో మార్కెట్ చాలా ఎక్కువ కానీ పుష్ప 2 సినిమాకి హైప్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమా కల్కి సినిమాతో పోటీ పడుతుంది అంటూ మరికొందరు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
నిజానికి ఇటు అల్లు అర్జున్, అటు ప్రభాస్ ఇద్దరూ కూడా ఈ సంవత్సరం పాన్ ఇండియాలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ వసూళ్లను రాబట్టి భారీ సక్సెస్ గా నిలుస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వీటిలోనే ఏదో ఒకటి ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…