https://oktelugu.com/

Raviteja: రవితేజ చాలా తక్కువ గా తినడానికి కారణం ఏంటి..?

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే రవితేజ ఎక్కువగా తినడానికి ఇష్టపడడట.

Written By:
  • Gopi
  • , Updated On : March 23, 2024 / 11:59 AM IST

    Raviteja-Eats-Less-Food

    Follow us on

    Raviteja: సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ల కంటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది వారసత్వ ప్రకారం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరి కొంతమంది మాత్రం చాలా కష్టపడుతూ ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే మొదటి నుంచి కూడా తన కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తు వస్తున్నాడు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే రవితేజ ఎక్కువగా తినడానికి ఇష్టపడడట. ఎందుకు అంటే ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. ఇక అదే పనిగా పెట్టుకొని తినేవాళ్ళకి అంతగా బాగుండదు అనే విధంగా తను ప్రతిసారి చెప్తుంటారట. ఇక రీసెంట్ గా ఈగల్ సినిమా షూటింగ్ టైంలో నవదీప్ తో కూడా అదే విషయాన్ని చెప్పినట్టుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    నిజానికి రవితేజ ఎందుకు అలా చెప్తారు అంటే మనిషి బతకడానికి తినాలి కానీ, ఎక్కువగా తినడం వల్ల మనిషి ఆరోగ్యం కూడా చెడిపోతుందనే ఉద్దేశ్యంతోనే తను వాళ్ళ అందరికి చెబుతూ ఉంటాడట. తను మాత్రం ఆకలైన సమయంలో తింటాడని చెప్పాడు. ఇలా ఆయనకున్న ఈ ఒక్క మంచి హాబిట్ వల్లే తను ఇప్పటికీ కూడా చాలా స్లిమ్ గా అండ్ స్ట్రాంగ్ గా ఉంటున్నాడు అంటూ మరి కొంతమంది రవితేజ అభిమానులు కూడా చెప్తున్నారు.

    ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే రవితేజ మార్కెట్ మరింత భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
    ఇక మొత్తానికైతే వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు…ఇక ఈ సినిమాలతో రవితేజ వరుస సక్సెస్ లు కొట్టడానికి రెఢీ అవుతున్నాడు…