Subhash Chandra Bose OG connection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఓజీ(They Call Him OG) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత పవన్ నుండి ఈ రేంజ్ కం బ్యాక్ వస్తుందని అభిమానులు ఊహించారు కానీ, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఊహించలేదు. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ లో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా వచ్చిందని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే ఎలివేషన్ సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో డైరెక్టర్ సుజిత్ చాలా అంశాలు దాచిపెట్టినట్టుగా, వాటిని కేవలం సీక్వెల్ లోనే చూపించాలని ఫిక్స్ అయ్యినట్టు ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒకరికి అనిపించింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సుభాష్ చంద్ర బోస్ కి సీక్వెల్ లో ఒక లింక్ ఉంటుందట. పవన్ కళ్యాణ్ తండ్రి సుభాష్ చంద్ర బోస్ గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తి. అతనికి మంచి సన్నిహితుడు కూడా. అంతే కాకుండా కొంత కాలం అప్పట్లో సుభాష్ చంద్రబోస్ తన సతీమణి తో కలిసి జపాన్ లో కొన్నాళ్ళు ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తండ్రి పేరు ఇందులో అకిరా అని కూడా తెలుస్తుంది. సీక్వెల్ మొత్తం జపాన్ లోనే జరిగే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ సినిమా మొదటి కాపీ లో క్లైమాక్స్ చివర్లో పవన్ కళ్యాణ్ పెద్ద తనయుడు అకిరా నందన్ తో కొన్ని సన్నివేశాలను తీసినవి ఉండేవని, కానీ అవి పెద్దగా ప్రభావం చూపించకపోవడం తో చివరి నిమిషం లో కట్ చేసి వేరే వెర్షన్ ని జత చేసారని టాక్.
అకిరా నందన్ మీద తీసిన సన్నివేశాలు సెకండ్ పార్ట్ ప్రారంభం నుండే ఉంటాయట. ఎదో మాటవరుసకి సీక్వెల్ అని క్లైమాక్స్ చివర్లో వేయలేదని, కచ్చితంగా భవిష్యత్తులో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం ఒక్కటే బ్యాలన్స్. ఈ సెకండ్ పార్ట్ లో ఇంకో పాన్ ఇండియన్ హీరో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయట. అయితే మొదటి భాగం లో స్టోరీ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు డైరెక్టర్ సుజీత్. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఎలివేషన్స్ వేయడానికే సినిమా తీసినట్టుగా అనిపించింది. అలా కాకుండా ఈసారి స్టోరీ మీద ఫుల్ ఫోకస్ పెట్టి తియ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం లో ఆడియన్స్ కి సాంగ్స్ ఉంటే బాగుండును అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కేవలం ఒకే ఒక్క పాట ఉందని, సెకండ్ హాఫ్ లో ఏమి లేకపోవడం వల్ల అభిమానులకు కాస్త నిరాశ కలిగిందని, సెకండ్ పార్ట్ లో అలాంటివి మొత్తం చూసుకోమని అంటున్నారు.