https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ చేసిన ఒకే ఒక మిస్టేక్ వల్ల ఆయన తెలుగులో చిరంజీవిని బీట్ చేయలేకపోయాడా..?

సౌత్ ఇండియా లో చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరు కూడా మోస్ట్ టాలెంటెడ్ హీరోలని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...వీళ్ళను చూసే చాలా మంది సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 04:25 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన 4 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతూ వస్తున్నాడు. 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా ఆయన ఇప్పటికీ హీరోగా ఇండస్ట్రీ ని శాసిస్తున్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వచ్చాయి. ముఖ్యంగా 90 వ దశకంలో ఆయన చాలా రికార్డులను క్రియేట్ చేశారనే చెప్పాలి. ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఘనత కూడా చిరంజీవికే దక్కుతుంది… ఇక ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించడంలో చిరంజీవిని మించిన నటుడు మరొకరు లేరనేది వాస్తవం.. అయితే చిరంజీవి మాస్ సినిమాలను ఎక్కువగా చేస్తూ మాస్ లో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానివల్లే ఆయన క్రేజ్ అనేది ఇప్పటికీ తరిగిపోని, కరిగిపోని, చెరిగిపోని ఒక కొండ లాగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే 90వ దశకం లో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన నటులలో రజనీకాంత్ ఒకరు. ఆయన తమిళం లో తీసిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ భారీ సక్సెస్ లను సాధించాయి. ఇక అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేసేవారు. ఇక మన తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే ఏ హీరో సినిమా అయిన కూడా ఆదరిస్తూ ఉంటారు.

    కాబట్టి రజనీకాంత్ కి కూడా ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభించింది. ఇక అందులో భాగంగానే ఆయనకు ఒకానొక సమయంలో తెలుగులో చిరంజీవిని డామినేట్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆయన చేసిన ఒక మిస్టేక్ వల్ల ఆయన చిరంజీవిని డామినేట్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అది ఏంటి అంటే రజనీకాంత్ ఎక్కువగా ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ లో ఉండేవాడు. ఎందుకు అంటే చిరంజీవి విపరీతంగా డాన్స్ చేస్తున్నాడు నేను చేయడం లేదు. కాబట్టి తెలుగులో చిరంజీవిని నేను డామినేట్ చేయడం చాలా కష్టమని అనుకునేవారు.

    దాని వల్లే ఆయన చిరంజీవిని అధిగమించి ముందుకు వెళ్లలేకపోయాడు. లేకపోతే మాత్రం ఆయన చేసిన సినిమాల ద్వారా కానీ, ఆయన పోషించిన పాత్రలోని నటన వల్ల కానీ కొన్ని సార్లు చిరంజీవి ని డామినేట్ చేసినట్టుగా అనిపించినప్పటికీ ఆయన మాత్రం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాడు. ఇక అలాగే ఆయన తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయకపోవడం వల్ల కూడా ఆయన కెరియర్ అనేది తెలుగులో అంత బాగా బిల్డ్ అవ్వలేకపోయిందనే చెప్పాలి…

    ఇక మొత్తానికైతే తమిళంలో రజనీకాంత్ ఆ ఇండస్ట్రీ ని చాలా సంవత్సరాల పాటు శాసిస్తే, తెలుగులో చిరంజీవి ఏకచత్రాధిపత్యంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమా ఇండస్ట్రీని ఎలుతున్నాడనే చెప్పాలి… ఇక ఇప్పటికి కూడా మెగాస్టార్ ను రీప్లేస్ చేసే నటుడు ఎవరు అనే విషయం మీద చాలా రకాల ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ ఆయన లాంటి నటుడు మాత్రం ఇంకా ఇండస్ట్రీ కి దొరకలేదనే చెప్పాలి…ఇక ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర అనే సినిమా చేస్తూ యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతున్నారు…