Vijay Devarakonda- Ram Charan: #RRR వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినెమాలపైనా ప్రత్యేకమైన దృష్టిని సారించాడు..ప్రస్తుతం ఆయన శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే అధిక శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు..ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 50 వ చిత్రం గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సమయంలోనే రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా ఒప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించబోతోంది.
రేపో ఎల్లుండో షూటింగ్ కూడా ప్రారంభం అయిపోతుందని అనుకుంటున్న సమయంలో రామ్ చరణ్ కి మరియు గౌతమ్ కి ఏర్పడిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వాళ్ళ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఈ వార్తలపై యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..దానితో ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది అనే వార్తలకు బలం చేకూరుంది..అయితే లేటెస్ట్ గా అందుతున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఇదే కథతో విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట గౌతమ్.

ఇటీవలే విజయ్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించగా ఆయనకీ ఎంతగానో నచ్చిందట..వెంటనే చేద్దామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం..లైగర్ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ తో తీవ్రమైన నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమా కథ వినగానే బ్లాక్ బస్టర్ అనిపించిందట..అలాంటి రేంజ్ కథ అయితే రామ్ చరణ్ ఎందుకు రిజెక్ట్ చేసాడు..? బహుశా అతని మాస్ ఇమేజి కి ఈ స్టోరీ సరిపడదని అనుకున్నారా..? అనే సందేహాలు మొదలయ్యాయి..అయితే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని మరో హీరో ఒప్పుకొని చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం మనం చాలా సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము..విజయ్ దేవరకొండ విషయం లో కూడా అలా జరగబోతుంది లేదా అనేది చూడాలి .