Venkatesh dialogue leaked: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి వరుస సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆశించిన మేరకు సక్సెలను సాధించలేకపోతున్నాడు. అందుకే ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను తన కథలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే… ఆయన సినిమాలో చేస్తున్నాడు అంటే ఆ మూవీలో తప్పకుండా కామెడీ ఉంటుందనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో చిరంజీవి, నయనతార ఇద్దరు విడాకులు తీసుకునే సందర్భంలో వెంకటేష్ వచ్చి ‘నువ్వు మాజీ నేను మాజీ’ అంటూ కొన్ని డైలాగులు చెబుతాడు.
ఏంటి మాజీనా అనగానే అవును మీరు మాజీ నే కదా రాజీకి వచ్చారు. అంటూ ఆయన డైలాగ్ చెబుతాడట. మొత్తానికైతే ఈ సినిమాలో వెంకటేష్ తన డైలాగ్స్ తో ప్రేక్షకులకు మరోసారి కామెడీ పంచే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకీ వచ్చిన తర్వాతే ఈ సినిమాలో కామెడీ స్టార్ట్ అవుతుందని అనిల్ రావిపూడి గతంలో తెలియజేస్తాడు…
ఇక అప్పటి వరకు చిరంజీవి నయన తార మధ్య కొన్ని సీరియస్ సీన్స్ ఉంటాయట. వెంకటేష్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక మరో 2 రోజుల్లో వెంకటేష్ తన పూర్తి షూట్ కంప్లీట్ చేసుకుంటున్నారట… ప్రస్తుతం త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా 2026 లో రిలీజ్ కి సిద్ధం అవుతోంది…