Garikapati: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ వరల్డ్ వైడ్ గా భారీ హిట్ సాధించింది. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్టందుకొని అల్లు అర్జున్ బాక్సాఫీస్ హీరోగా నిలిచాడు. అనుహ్యంగా బాలీవుడ్లోనూ ‘పుష్ప’ భారీ వసూళ్లు సాధించడంతో ఒక్కసారిగా బన్నీ ప్యాన్ ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

పిల్లల పెంపకంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు ర్యాంకు సాధిస్తే వాడికి సెలెబ్రేషన్స్ చేసేస్తున్నారు.. దీంతో వాడు హీరోలా బిల్డప్‌లు ఇస్తున్నాడు.. నన్ను మించిన హీరో ఇంక లేడు అనుకుంటున్నాడు.. దీంతో అనర్థాలు జరుగుతున్నాయి..’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల గురించి గరికపాటి మాట్లాడుతూ.. ‘ఇవాళ సినిమాలు రౌడీ, ఇడియట్ అంటూ వస్తున్నాయన్నారు.
నిన్నగాక మొన్న ‘పుష్ప’లో హీరోని స్మగ్లింగ్ చేసే వాళ్లను మంచి చూపించారు. ‘అదేంటని అడిగితే చివర్లో మంచిగా చూపిస్తాం.. లేకపోతే పుష్ప-2 తీస్తాం.. పార్ట్-3 తీస్తామంటారు. అంటే నువ్వు తీసి చూపించే వరకూ ఇక్కడ సమాజం చెడిపోవాలా? ఈ సినిమా వల్ల స్మగ్లింగ్ గొప్ప అనే భావన రాలేదా?’ అంటూ గరికపాటి ప్రశ్నించారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ చెప్పడంపై గరికపాటి సైటర్ వేశారు. ‘ఎవడైనా కుర్రాడు గూబ మీద కొట్టి తగ్గేదేలే అంటాడు.. మరి దీనికెవరు కారణం. ఇలాంటి విషయాలు మాట్లాడితే అందరికీ కోపమే వస్తుంది’ అంటూ ఆయన వివరించారు. తగ్గెదెలే అని హరిశ్చంద్రుడు, శ్రీరాముడి లాంటివాళ్లు అనాలి గానీ ఒక స్మగ్లర్ ఆ డైలాగ్ వాడటం ఏంటీ? దీనికి హీరో, డైరెక్టర్ సమాధానం చెప్పాలన్నారు. మరీ దీనిపై ‘పుష్ప’ టీం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!
https://twitter.com/IamKKRao/status/1488811877291671554?s=20&t=FqIC3ozdo6JXMNDS4oIgng
[…] Buchi Babu Director: ‘ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం’ అన్నాడట వెనకటికి ఒకడు. అలా ఉంది బుచ్చిబాబు వ్యహారం. ఎన్టీఆర్ తో సినిమా అంటూ తనకు తానే ఒక చిన్న గాసిప్ వదిలాడు. ఆ గాసిప్ కాస్త వైరల్ అయ్యి.. చివరకు సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యే వరకు వెళ్ళింది. అసలు పుకార్లకు తెలుగు నెల పుట్టినిల్లులా అయిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లకు అసలు ఆడు అదుపు ఉండవు. […]