Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ‘భీమ్లానాయక్ విడుదల ఎప్పుడో జగన్ గారిని అడగండి’ అంటున్నాడు పవన్ కళ్యాణ్ నిర్మాత. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ను ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించడం తెలిసిందే. దీనిపై మరింత స్పష్టత కావాలని చిత్ర నిర్మాత నాగవంశీని మీడియా కోరింది.

దీంతో ఆయన ‘మీరు జగన్ గారిని అడగాలి. ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడు సినిమా విడుదల’ అని తెలిపారు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కాబట్టే.. జగన్ ఇలా చేస్తున్నాడు అని నిర్మాత నాగవంశీ ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది. మరి నాగవంశీ మాటలకు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: మోసపోవడం ఉద్యోగులకు అలవాటైందా?
అన్నట్టు రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ ‘భీమ్లా నాయక్’లో హోమ్లీ బ్యూటీ నిత్యా మీనన్, యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి రన్ టైమ్ లాక్ చేశారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కేవలం 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారట.
Also Read: కాపులపై వైసీపీ ప్రేమ.. తుని ఘటనలో కేసులు ఎత్తివేత
[…] Sreeleela: టాలీవుడ్ కి ఎప్పటినుంచో ఉన్న ఆచారం ఏమిటయ్యా అంటే.. కథల్లో కొత్తదనం లేకపోయినా నటీమణుల విషయంలో మాత్రం నిత్యం కొత్తదనం కావాలి. అందుకే, ప్రతి సంవత్సరం తెలుగు తెర పై కనీసం డజను మంది కొత్త భామలు గ్లామర్ ప్రపంచంలోకి అందాల ఆరబోతకు రెడీ అవుతారు. కాకపోతే ఎంత ఆరబోసినా వాళ్ళల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండలేరు. కానీ, కొంతమంది మాత్రం మొదటి సినిమాతోనే పదేళ్ల లైఫ్ ను తెచ్చుకుంటారు. ఆ కోవలోకే వస్తోంది శ్రీలీల. […]