https://oktelugu.com/

Upasana: రామ్ చరణ్ సోషల్ మీడియా పోస్ట్ పై ఉపాసన షాకింగ్ రియాక్షన్.. హాట్ టాపిక్!

చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. కంగ్రాట్స్ డాడీ .. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ ఆ ఫోటో ఫ్యాన్స్ తో పంచుకున్నారు రామ్ చరణ్.

Written By:
  • S Reddy
  • , Updated On : May 11, 2024 / 10:03 AM IST

    Upasana

    Follow us on

    Upasana: రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నారు. అలాగే ఐఏఎస్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు అంతకంతకూ ఆలస్యం అవుతుంది.

    ఇదిలా ఉంటే… రామ్ చరణ్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రామ్ చరణ్ తాజాగా చేసిన పోస్ట్ పై ఉపాసన స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి మే 9 గురువారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన తో పాటు చిరంజీవి సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు

    ఇక చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. కంగ్రాట్స్ డాడీ .. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ ఆ ఫోటో ఫ్యాన్స్ తో పంచుకున్నారు రామ్ చరణ్. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో పై రామ్ చరణ్ వైఫ్ ఉపాసన స్పందించారు. ‘వావ్ .. మిస్టర్ ఆర్ సీ త్వరగానే స్పందించావు’ అని కామెంట్ పెట్టింది. ఇంత వేగంగా, కరెక్ట్ టైం కి పోస్ట్ చేశాడే అని అర్థం వచ్చేలా… ఉపాసన కామెంట్ ఉంది. రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఏమంత యాక్టివ్ గా ఉండరు.

    ఎప్పుడో తీరిక దొరికినప్పుడు లేట్ గా పోస్టులు, ట్వీట్స్ వేస్తుంటారు.అందుకే ఉపాసన ఇలా ఆశ్చర్యపోతూ కామెంట్ చేశారు. గతంలో ఒకసారి నిహారిక కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది. చరణ్ అన్న ఎక్కువగా వాట్సాప్ కూడా వాడడు, ఫ్యామిలీ గ్రూప్ లో కూడా ఉండదు అని నిహారిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా చరణ్ లేటెస్ట్ పోస్ట్ పై ఉపాసన రియాక్షన్ వైరల్ అవుతుంది.