https://oktelugu.com/

Suhas: కలర్ ఫోటో సుహాన్ కష్టాల కడలి వింటే కన్నీళ్లు ఆగవు..

వెండితెరపై హీరోగా కనిపించాలనే కల. నటనపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ వచ్చి కష్టాలున్న ఓర్చుకొని, ఇండస్ట్రీలో ఎదిగి తనేంటో నిరూపించుకున్న హీరో సుహాన్. యూట్యూబ్ తో కెరీర్ స్టాట్ చేసి..

Written By:
  • Neelambaram
  • , Updated On : March 11, 2024 / 04:01 PM IST

    Unknown-facts-about-Color-p

    Follow us on

    Suhas: కలలను కనాలి వాటిని సాకారం చేసుకోవాలి. కల కనడం గొప్ప కాదు. వాటిని నిజం చేసుకున్నవారే కల కనడానికి నిజమైన అర్హులు. కొంత మందికి ఇంజనీర్ కావాలనే కల. మరికొందరికి డాక్టర్. ఇంకొందరికి యాక్టర్ కావాలనే కోరిక. కానీ ఇండస్ట్రీలో ఉండే కష్టాల వల్ల యాక్టర్ అవడం డాక్టర్ అవడం కంటే కష్టం. డబ్బుండి చదివే సత్తా ఉంటే డాక్టర్ అవచ్చు. కలెక్టర్ అవచ్చు. కానీ అదృష్టం, నటన, పరిచయాలు ఇలా ఎన్నో ఉంటే యాక్టర్ గా నిలచే అవకాశం దక్కుతుంది. అయితే ఎంతో మంది యాక్టర్లు ఇప్పుడున్న స్టార్లు సైతం ఒకప్పుడు కష్టాలు పడ్డవారే. స్వయం కృషితో పైకివచ్చిన వారి కష్టాలు వింటే సినిమా రంగం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడుతుంటారు. అయినా సరే కొంత మంది కష్టాలు తెలుసుకొని ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు మరికొందరు. అయితే ఎన్నో కష్టాలు పడిన హీరో సుహాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

    వెండితెరపై హీరోగా కనిపించాలనే కల. నటనపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ వచ్చి కష్టాలున్న ఓర్చుకొని, ఇండస్ట్రీలో ఎదిగి తనేంటో నిరూపించుకున్న హీరో సుహాన్. యూట్యూబ్ తో కెరీర్ స్టాట్ చేసి.. వెండితెరపై మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ హీరో. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమా ద్వారా మంచి ప్రేక్షకాదరణ పొందాడు హీరో సుహాన్. ఈ సినిమాకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థేయేటర్ల లో కాకుండా.. ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా మాత్రం హీరోగా సుహాన్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. హీరోకు గుర్తింపే కాదు చిత్రం జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ఇప్పుడు ఆయన హీరోగా వచ్చిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా కు కొత్త దర్శకుడు షణ్మఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తే.. టీనా శిల్వరాజ్ సుహాన్ సరసన నటించింది.

    ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన సుహాన్. ఇలా హీరోగా ఎలా ఎదిగాడు అనే వివరాలు తెలిస్తే.. ఆయనకు ఉన్న పట్టుదలకు, పడ్డ కష్టానికి సుహాన్ కు అందరు ఫిదా అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎక్కడ సుహాన్ ఎక్కడ ఎదిగాడు అని అందరు అనేలా ఎదిగాడు ఈ హీరో.తను చదువుకునే రోజుల్లో సినిమాలు తప్ప పుస్తకాలు పట్టించుకోని వ్యక్తి సుహాన్. కాలేజీ బంక్ కొట్టి, మ్యాట్నీ, మార్నింగ్ షోకి హాజరై, టికెట్ కోసం క్యూలో నిలబడి లైన్ లో చొక్కాలు చింపుకున్న హీరో ఇప్పటి సుహాన్. ఈ విషయాలు నాన్నకి తెలిస్తే బెల్ట్ కూడా తెగేదంటా.. అయినా సినిమాలు చూడడం మానేసేవాడు కాదు ఈ హీరో.

    అలా నాన్న కొట్టిన సినిమాలు ఆపని సుహాన్, కచ్చితంగా సినిమాలో నటించే అవకాశం వస్తుంది అనే ఆశతో చెప్పులు అరిగేలా తిరిగాడు. వచ్చిన అరకొర వేషాలతో కడుపునిండక, భవిష్యత్తు కనపడక, కళ్లల్లో నిండిన నీళ్లతో నిద్రపోయాడు సుహాన్. అలా యూట్యూబ్ లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మొదటి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు సంతోషించినా వెండితెర హాండ్ ఇచ్చి ఓటీటీ లో బ్లాక్ బస్టర్ అవడంతో కళ్లు ఆనందంతో మరోసారి నిండక ఎవరికి ఉంటాయి. అయితే జాతీయ అవార్డు రావడంతో తాను పడ్డ కష్టం అంతా మర్చిపోయాడు కావచ్చు. దాదాపు పదేళ్ల తర్వాత అద్భుతంగా సినిమాల్లో మెరిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిస్తున్నాడు హీరో.