https://oktelugu.com/

Tollywood: సత్తాచాటుతున్న టాలీవుడ్.. ఆందోళనలో బాలీవుడ్..!

Tollywood: కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ తన గ్రాఫ్ ను భారీగా పెంచుకంటూ ముందుకు దూసుకెళుతోంది. హలీవుడ్ రేంజులో సినిమాలను నిర్మిస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి మాస్ ఎలివేషన్స్ ఉన్న చిత్రాలను నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలంతా కూడా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ తగ్గెదేలే అంటున్నారు. ఒకప్పుడు భారీ కలెక్షన్లు సాధించాలంటే హిందీ సినిమాలకే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం సౌత్, టాలీవుడ్ సినిమాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2021 / 01:13 PM IST
    Follow us on

    Tollywood: కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ తన గ్రాఫ్ ను భారీగా పెంచుకంటూ ముందుకు దూసుకెళుతోంది. హలీవుడ్ రేంజులో సినిమాలను నిర్మిస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి మాస్ ఎలివేషన్స్ ఉన్న చిత్రాలను నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలంతా కూడా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ తగ్గెదేలే అంటున్నారు.

    Pushpa Deleted Scene

    ఒకప్పుడు భారీ కలెక్షన్లు సాధించాలంటే హిందీ సినిమాలకే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం సౌత్, టాలీవుడ్ సినిమాలు అత్యధిక కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాస్తున్నాయి. మాస్ మూవీలతో నార్త్ ప్రేక్షకులను టాలీవుడ్ ఇండస్ట్రీ తనవైపు తిప్పుకుంటోంది. దీంతో బాలీవుడ్లోనూ టాలీవుడ్ హీరోలకు భారీ క్రేజ్ దక్కుతోంది.

    కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ అవుతున్నాయి. క్లాస్ సినిమాలకు అలవాటుపడిన బాలీవుడ్ జనాలను మాస్ అంటే ఏంటో టాలీవుడ్ సినిమాలు రుచిచూపిస్తున్నాయి. బాలీవుడ్లో మన సినిమాల మాదిరిగా హీరోల స్టార్డమ్ చూపించే సినిమాలు ఇటీవల కాలంలో రావడం లేదు. వచ్చినా అందులో కథాబలం ఉండటం లేదు. దీంతో ఒకరిద్దరు బాలీవుడ్ హీరోలు మినహా అందరూ అక్కడ క్లాస్ సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు.

    ఈనేపథ్యంలోనే నార్త్ ప్రేక్షకులు క్రమంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవలీ కాలంలో హిందీ డబ్ అవుతున్న తెలుగు సినిమాలకు అక్కడ అత్యధిక టీఆర్పీలు రావడమే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. దీంతో మన హీరోలకు అక్కడ భారీ ఇమేజ్ పెరిగిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ఈక్రమంలోనే టాలీవుడ్ సినిమాలను పలువురు నిర్మాతలు హిందీలో డైరెక్ట్ గా డబ్ చేస్తున్నారు. వీటికి కలెక్షన్లు అదిరిపోయేలా వస్తున్నాయి.

    Also Read: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !

    ప్రభాస్ నటించిన ‘బాహుబలి’, ‘సాహో’, యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమాలు ఉత్తరాదిన మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇక ఇటీవల రిలీజైన ‘పుష్ప’ హిందీ వర్షన్ కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. ఈ మూవీ విడుదలైన రోజు నార్త్ లో రూ.3 కోట్ల పైచిలుకు గ్రాస్ కలెక్ట్ చేసింది. వీకెండ్లోనూ అదరగొట్టే కలెక్షన్లు రాబట్టి ఈ చిత్రం సోమవారం, మంగళవారాల్లో రూ.4 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది.

    బాలీవుడ్లో ‘పుష్ప’ కలెక్షన్లను చూసి ఆశ్చర్యపోతూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈస్థాయిలో ఓ డబ్బింగ్ మూవీ కలెక్షన్లు సాధించడం కచ్చితంగా బాలీవుడ్ హీరోలను కంగారు పెట్టించడం ఖాయమన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ రానున్నాయి. ఈ సినిమాలు బాలీవుడ్లో హిట్ అవడం ఖాయంగా కన్పిస్తోంది. సౌత్ సినిమాలు ఇలానే బాలీవుడ్లో ఆధిపత్యం చెలాయిస్తే అక్కడి ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: ఫస్ట్​టైం పుష్పరాజ్​ లాంటి కొడుకుంటే బాగుండనిపించింది- కల్పలత