Before after Tollywood: మీకు ఏ హీరో అంటే ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అర్జున్ రెడ్డి, గోపీచంద్, బాలయ్య వంటి హీరోల పేర్లు చెబుతుంటారు. వారి ఔట్ ఫిట్స్, డ్రెస్సింగ్, ఇక బాడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రేంజ్ లో ఉంటారు కదా. ఇక ఎలాంటి స్టైల్ మెయింటెన్ చేసినా సరే సూపర్ గా కనిపిస్తుంటారు. వారి గురించి చెడుగా మాట్లాడినా, కాస్త చెడుగా కామెంట్లు పెట్టినా సరే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఓ రేంజ్ లో ఆడుకుంటారు. కొన్ని సార్లు యుద్ధాలే జరుగుతాయి స్వామీ.
Also Read: ఆ విషయంలో ప్రభాస్ అంత ఎమోషనల్ అయ్యాడు ఏంటి..? వైరల్ వీడియో…
ఒక హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ ఇంకో హీరో ను తిట్టినా సరే ఆ ఫ్యాన్స్ తో సహా ఆ హీరోను కూడా టార్గెట్ చేస్తుంటారు. తేడా వస్తే దబిడిదిబిడే అనేట్టుగా ఉంటారు ఈ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మీరొక వీడియో చూస్తే ఎంత కోపానికి వస్తారో? లేదా ఫన్నీగా నవ్వుతారో తెలియదు. ఎందుకంటే హీరోలను ఒక రేంజ్ లో ఊహించుకునే అభిమానులు ఇలాంటి వీడియోలను చూస్తే తట్టుకుంటారా? ఈ AI వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కొందరు మంచికి వాడితే చెడుగా వాడే వారే ఎక్కువ అవుతున్నారు.
ఈ మంచి చెడులను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మీకు ఇష్టమున్న హీరోలు ఎలా కనిపిస్తున్నారో చూడండి. అల్లు అర్జున్ సిట్టింగ్ పొజీషన్, ఎన్టీఆర్ చాక్లెట్ తింటూ, రామ్ చరణ్ కింద పడుకొని జిమ్ చేస్తున్నట్టు, బాహుబలిలో ప్రభాస్, ఇక అర్జున్ రెడ్డి ఫ్యాషన్ షో ఇచ్చినట్టు, రానా కోపంగా చూస్తున్నట్టు అమ్మో ఆ వీడియోలను చూస్తే తట్టుకుంటారా? ఇది ఎవరు ఎడిట్ చేశారో? ఎలా క్రియేట్ చేశారో కానీ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంత ప్రొటీన్ తీసుకోకపోతే ఇలా అయ్యారు అని మరీ పోస్ట్ చేశారు. టాలీవుడ్ బొమ్మలు అనే ఛానెల్ లో వచ్చిన ఈ వీడియో కొందరికి నవ్వు తెప్పిస్తే మరికొందరికి ఆగ్రహం కలిగిస్తుంది. కొందరు ఏమో మా బాలయ్య లుక్ కూడా కావాలి అంటున్నారు.
Also Read: సంజయ్ దత్ ను బయటపెట్టిన ప్రభాస్… ఆయనతో మామూలుగా ఉండదు…
కానీ నిజమైన హీరోల బాడీలకు ఈ ఏఐ క్రియేటివ్ వీడియోకు ఏమైనా సంబంధం ఉందా? వారి అందం, శరీరం, పిట్నెస్ ఓ రేంజ్ లో మెయింటెన్ చేస్తారు. ఈ వీడియో ఆ హీరోల వరకు చేరితే కచ్చితంగా భయపడతారు కావచ్చు కదా. అచ్చం స్కెలెటిన్ కు బట్టలు వేసినట్టుగా డిజైన్ చేశారు. కానీ దీనికి ఫన్నీ కామెంట్లే ఎక్కువ వస్తున్నాయి. బక్కబలి, పని లేదారా, ఏ ఏఐ టూల్, నీకు టాలీవుడ్ అంటే హేటా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. అడగడం మర్చిపోయాను. మీ ఫేవరేట్ హీరో ఉన్నారా ఇందులో?
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
