https://oktelugu.com/

Tillu Square Twitter Talk: టిల్లు స్క్వేర్ మూవీ ట్విట్టర్ టాక్… సినిమా హిట్టా ఫట్టా? ఆడియన్స్ ఏమన్నారంటే!

టిల్లు స్క్వేర్ డీసెంట్ ఎంటర్టైనర్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హీరో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, కామెడీ డైలాగ్స్ సినిమాకు హైలెట్. అవి వర్క్ అవుట్ అయ్యాయి. నవ్వులు పూయిస్తాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 29, 2024 8:52 am
    Tillu Square Twitter Talk

    Tillu Square Twitter Talk

    Follow us on

    Tillu Square Twitter Talk: సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో తెరకెక్కించిన లవ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ టిల్లు స్క్వేర్. వరల్డ్ వైడ్ మార్చి 29న విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. టిల్లు స్క్వేర్ ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూద్దాం… ఆడియన్స్ టిల్లు స్క్వేర్ పట్ల పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తోంది.

    టిల్లు స్క్వేర్ డీసెంట్ ఎంటర్టైనర్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హీరో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, కామెడీ డైలాగ్స్ సినిమాకు హైలెట్. అవి వర్క్ అవుట్ అయ్యాయి. నవ్వులు పూయిస్తాయి. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. కొన్ని సీన్స్ మాత్రం బోర్ కొట్టిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే టిల్లు స్క్వేర్ పర్లేదు, అని ఓ ప్రేక్షకుడు రాసుకొచ్చాడు.

    మరొక నెటిజెన్… స్టార్ బాయ్ సిద్దు పెర్ఫార్మన్స్, ఆయన చెప్పిన వన్ లైనర్స్ అద్భుతంగా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పర్లేదు. సినిమాకు మ్యూజిక్ సపోర్ట్ ఇచ్చింది. టైం పాస్ మూవీ. పార్ట్ 1 తో పార్ట్ 2 కనెక్షన్ సీన్స్ బాగానే కుదిరాయి. సినిమాకు పాస్ మార్క్స్ వేయవచ్చు.. అని అభిప్రాయ పడ్డాడు. మరో నెటిజన్ అనుపమ పరమేశ్వరన్ పెర్ఫార్మన్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకు ఆమె మైనస్ అన్నాడు. ఆమె మ్యాజిక్ చేయలేకపోయింది. డీజే టిల్లులో నటించిన నేహా శెట్టి బాగా చేసిందని అభిప్రాయ పడ్డాడు..

    టిల్లు స్క్వేర్ చిత్రానికి క్లైమాక్స్ మైనస్ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. 80 శాతం చిత్రాన్ని కామెడీగా నడిపి చివర్లో సీరియస్ టర్న్ ఎందుకు తీసుకున్నారు. ఏది ఏమైనా కామెడీ పరంగా ఎంటర్టైన్ చేస్తుంది… అని కామెంట్ చేశాడు ఓ నెటిజన్. టిల్లు స్క్వేర్ ట్విట్టర్ టాక్ గమనిస్తే పాజిటివ్, మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది.

    2022లో విడుదలైన బ్లాక్ బస్టర్ డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. పార్ట్ 1 కి విమల్ కృష్ణ దర్శకుడు. పార్ట్ 2కి మాలిక్ రామ్ దర్శకుడిగా వ్యవహరించాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ట్రైలర్, ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ బాగున్నాయి.